Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చంద్రబాబు సభలో 8 మంది మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

చంద్రబాబు సభలో 8 మంది మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు!
-చంద్రబాబు కందుకూరు సభలో తొక్కిసలాట
-సెక్షన్ 174 కింద కేసు నమోదు
=ప్రమాదంపై దర్యాప్తు జరపనున్న పోలీసులు

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 174 కింద కందుకూరు పీఎస్ లో కేసు నమోదయింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరపనున్నారు.

మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబాలను చంద్రబాబు స్వయంగా పరామర్శిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు టీడీపీ నేతలు ఆయా గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాల పిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించారు.

ఎనిమిదికి పెరిగిన టీడీపీ సభ మృతుల సంఖ్య

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభ తీవ్ర విషాదకర పరిస్థితుల నడుమ రద్దయింది. కార్యకర్తల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మర్లపాటి చినకొండయ్య (అమ్మపాలెం), కాకుమాని రాజా (కందుకూరు), పురుషోత్తం (కందుకూరు), కలవకూరి యానాది (కొండముడుసుపాలెం), దేవినేని రవీంద్రబాబు (ఆత్మకూరు), యాటగిరి విజయ (ఉలవపాడు) అనే ఆరుగురిని గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.

చంద్రబాబు సభలో దుర్ఘటనపై ప్రధాని మోదీ సీఎం జగన్ దిగ్భ్రాంతి..

మృతుల నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. సభకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ,ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందానని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని… గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సీఎం జగన్ ఒక్కరికి 2 లక్షల చొప్పున ,గాయాలైనవారికి ఒక్కరికి 50 వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు .

Related posts

రెండేళ్లుగా విధులకు హాజరు కాని మహిళా ఐపీఎస్.. కనిపించడం లేదంటూ పత్రికా ప్రకటనలు!

Drukpadam

యూపీ ఎస్పీ నేత ఇంట్లో నోట్ల కట్టల లెక్క తేలింది… రూ.177 కోట్లు స్వాధీనం!

Drukpadam

హోటల్ బిల్లు వివాదంలో హెడ్ కానిస్టేబుల్ ను చంపేసిన కబడ్డీ ఆటగాళ్లు

Ram Narayana

Leave a Comment