Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం అసెంబ్లీ సీటుపై పట్టుబిగించిన మంత్రి అజయ్ …

ఖమ్మం అసెంబ్లీ సీటుపై పట్టుబిగించిన మంత్రి అజయ్
వాడవాడ పువ్వాడ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
నేరుగా ప్రజలను కలుసుకుని వారి బాగోగులు తెలుసుకుంటున్న పువ్వాడ
అమ్మ ,అవ్వ ,తాతా అంటూ పలకరింపులు
-1200 కోట్లతో ఖమ్మం అభివృద్ధిమరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ద్రుష్టి
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా ఖమ్మం
అజయ్ ని ఢీకొనాలంటే ఇబ్బందే అంటున్న పరిశీలకులు

 

జిల్లాకేంద్రమైన ఖమ్మం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గంపై పట్టు బిగించారు . ఇప్పటికే వరసగా రెండు సార్లు గెలిచి ముచ్చటగా మూడవసారి గెలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు . అందువల్లనే ఖమ్మంలో అజయ్ ని ఢీకొనాలంటే ఇబ్బందే అంటున్నారు విశ్లేషకులు . ఆయన దగ్గర మొహమాటంలేదు . శషభిషలు అసలే లేవు .పని అవుతుందంటే అవుతుందికాదంటే కాదు అంతే…. ఆశ చూపడానికి అసలే ఇష్టపడరు . అందుకే ఎంతోమంది ఆయన్ను బలహీన పరచాలని చుసినప్పటికీ మరింత బలపడుతున్నారు. గోడకు కొట్టిన బంతిలా మరింత వేగం పుంజుకుంటున్నారు .

మంత్రిగా తనకు వచ్చిన అవకాశం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తూ శహబాష్ అనిపించుకుంటున్నారు . ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఏకంగా 1200 కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తున్నారు . ఎక్కడ అవినీతి మరకలేదు.సింపుల్ గా ప్రజల మధ్య ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు . స్వయంగా సమస్యలు తెలుసుకుంటూ వాటికీ పరిస్కారాలు వెతుకుతున్నారు . ప్రభుత్వ పథకాలను సక్రమంగా ఇంప్లిమెంట్ చేయించేందుకు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు .దీంతో మంత్రి ఊర్లో ఉన్నా లేకపోయినా మంత్రి సహాయం కోసం వచ్చేవారికి సహాయం అందుతుందని నమ్మకం ఏర్పడింది . అక్కడకు వెళ్లి చెప్పుకుంటే తమ పనులు అయిపోతాయనే అభిప్రాయాలు కల్పించగలిగారు .

వాడవాడలా పువ్వాడ ఒక వినూత్న కార్యక్రమం

మంత్రి పువ్వాడ అజయ్ వాడవాడలా పువ్వాడ పేరుతో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు . జనవరి ఒకటవ తేదీనుంచి దీనికి శ్రీకారం చుట్టిన అజయ్ దీన్ని నిరంతర కార్యక్రమంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు . ఖమ్మం నగరంలోని 17 డివిజన్లో మొదలు పెట్టిన కార్యక్రమంలో నియోజకవర్గం అంతా ఇదే వరవడిని కొనసాగించనున్నారు . ప్రత్యేకంగా స్థానిక కార్పొరేటర్ లేదా స్థానిక పార్టీ నాయకులూ ,ప్రజాప్రతినిధులతో అధికార యంత్రాగాన్ని వెంటబెట్టుకొని స్థానిక వాడలకు వెళ్లి స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు . కొన్ని సమస్యలు అక్కడిక్కడే పరిస్కారం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు . పేదలు నివసించే ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి అమ్మ , అవ్వ , తాతా , తమ్ముడు , అన్న , పెద్దాయన అంటూ పలకరిస్తున్న తీరుకు ప్రజలు ముగ్దులవుతున్నారు . కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో 35 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు . రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు . ఇది మిగతా నియోజకవర్గాలకు సైతం ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.

నియోజకవర్గ సమస్యలపై పూర్తీ అవగాహన

మంత్రి అజయ్ కుమార్ కి నియోజకవర్గ సమస్యలపై పూర్తీ అవగాహన ఉంది. అక్కడ ఏమూలన అవసరం ఉందనేది ఆయన మదిలో ఉంది. ఖమ్మం అభివృద్ధి సీఎం కేసీఆర్ కూడా ఆకర్షించింది. అందుకే ఇటీవల నిజామాబాద్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో ఖమ్మం లో మంత్రి అజయ్ చేసిన అభివృద్ధిని చూసి రావాలని కలెక్టర్ , ఎమ్మెల్యే , మేయర్ ఇతర అధికారులు , ప్రజాప్రతినిధులతో ఒక బృందాన్ని పంపించారు. అంతకు ముందు రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేట నుంచి అధికారులు వచ్చి ఇక్కడ అభివృద్ధిని చూసి వెళ్లారు .

అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఖమ్మం

రాష్ట్రంలోనే ఖమ్మంను అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చి దిద్దటంలో మంత్రి అజయ్ సక్సెస్ అయ్యారు . ఇంకా అభివృద్ధి చేయాలనీ తపన పడుతున్నారు . ఖమ్మం లాగా మంత్రి మా నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలనీ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు ప్రజలు కోరుకుంటున్నారు . ఖమ్మం మునేరు పక్కన ట్యాంక్ బండ్ ఏర్పాటు , మున్నేరు పై చెక్ డాం లు ,మున్నేరుపై పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి , రింగ్ రోడ్ లాంటివాటిపై కూడా మంత్రి ద్రుష్టి పెట్టారు . వాటిని సాధించడంలో ఆయన సక్సెస్ కావాలని కోరుకుందాం

Related posts

గవర్నర్ ప్రసంగంలో పసలేదు-సీఎల్పీ నేత భట్టి

Drukpadam

అమెరికా ,కెనాడాలలో మంచు తుఫాన్లు … స్తంభించిన జనజీవనం !

Drukpadam

ఆఫ్ఘన్ల సాయుధ పోరాటం: 4 జిల్లాలు తాలిబన్ల నుంచి తిరిగి స్వాధీనం!

Drukpadam

Leave a Comment