Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ ఆహ్వానం మేరకే తెలంగాణకు వెళ్లాను: అఖిలేశ్ యాదవ్!

కేసీఆర్ ఆహ్వానం మేరకే తెలంగాణకు వెళ్లాను: అఖిలేశ్ యాదవ్!

  • బీఆర్ఎస్ సభకు ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానించారు
  • కేంద్రంలోని బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి
  • వ్యవస్థల్లోకి బీజేపీ సొంత మనుషులను గుప్పిస్తోంది
ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ సింగ్ యాదవ్ హాజరయ్యారు. తాజాగా ఖమ్మం బీఆర్ఎస్ సభలో పాల్గొనడంపై అఖిలేశ్ యాదవ్ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడం వల్లే తాను వెళ్లానని అఖిలేశ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా కేసీఆర్ ఆహ్వానించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని… ఆ పార్టీ గద్దె దిగడానికి కేవలం 398 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో పేదలు, సమాన్యులు ఎవరికీ న్యాయం జరగడం లేదని విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కులను కూడా లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. కొందరు పారిశ్రామికవేత్తలకు మేలు చేసే విధంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లోకి సొంత మనుషులను బీజేపీ గుప్పిస్తోందని అన్నారు.

Related posts

తెలుగు రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తున్న కేంద్ర సర్కార్…

Drukpadam

అట్టహాసంగా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం!

Drukpadam

వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?

Ram Narayana

Leave a Comment