ఏపార్టీలో చేరేది నేనే స్వయంగా చెపుతా …మాజీఎంపీ పొంగులేటి!
–ఎవరో చెపితే ఎలా నిజం అవుతుంది
–ఎవరికీ తగ్గట్లు వారు చెప్పుకుంటున్నారు
–నాకు జిల్లా ప్రజలు ,నా అభిమానులే ముఖ్యం
–వారికోసం ఎందాకైనా పోరాడతా
–షర్మిల తన పార్టీలో పొంగులేటి చేరతానని అన్నారని చెప్పిన మాటలపై స్పందించిన శ్రీనివాస్ రెడ్డి
[videopress BfnM9ctd]
బీఆర్ యస్ కు దూరమైన పొంగులేటి రాజకీయ అడుగులపై రోజుకొక మాట …పూటకొక పుకారు షికార్లు చేస్తున్నాయి …దీనికి తోడు ఆయా రాజకీయ పార్టీలనుంచి లీకులు …దీంతో ఆయన బీజేపీలో చేరతారని కొందరు… లేదు…లేదు … కాంగ్రెస్ లో చేరతారని మరికొందరు ….లేదు మా పార్టీలో చేరతానని మాట ఇచ్చారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్వయంగా చెప్పడం మరోసారి చర్చలకు దారితీసింది . ఆయన ఎందులో చేరతారు అనేది ఇంకా మిస్టరీగానే ఉంది . పార్టీ మార్పు ఖాయం… ఎందులోకి పొతే ఎలా ఉంటుంది .ప్లస్ లు ఏమిటి మైనస్ లు ఏమిటి అనేది ఆయన లెక్కలు వేస్తున్నారు . ఆయనకు రాజకీయ గాడ్ ఫాదర్ గాని గురువు గాని ఎవరు లేరు …కాకపోతే ఏపీ సీఎం జగన్ మాట వింటారని నానుడి …
జిల్లాలో ఆయన రాజకీయ ప్రభావం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం . దీంతో ప్రత్యేకించి బీఆర్ యస్ పార్టీలో ప్రకంపనలు బయలుదేరాయి. బీఆర్ యస్ కూడా ఆయన వైపు ప్రజలు ,తమపార్టీ ముఖ్యలు వెళ్లకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ బీఆర్ యస్ లో ,అంతకుముందు వైసీపీలో ఎంపీగా ఉన్న పొంగులేటి మంచి పరిచయాలు ఉన్నాయి. దానివల్ల బీఆర్ యస్ కు చెందిన కొందరు ముఖ్యనేతలు ఇప్పటికే ఆయన వెంట గట్టిగానే తిరుగుతున్నారు . భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన జడ్పీ చైర్మన్ కోరంకనకయ్య పొంగులేటి కి జైకొట్టారు . తన జడ్పీ చైర్మన్ సీటు పోయిన పర్వాలేదని శీనన్న వెంట నా ప్రయాణం అంటున్నారు .అదే విధంగా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ బాబు , డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య , పాలేరు నియోజక ఇంచార్జి మద్దినేని బేబీ స్వర్ణ కుమారి ,మధిరకు చెందిన డాక్టర్ కోట రాంబాబు , సత్తుపల్లికి చెందిన డాక్టర్ దయానంద్ ,అశ్వారావుపేట కు చెందిన జాలే ఆదినారాయణ ,భద్రాచలంకు చెందిన డాక్టర్ తెల్లం వెంకటరావు ,పినపాక కు చెందిన పాయం వెంకటేశ్వర్లు , ఇల్లందుకు చెందిన కోరం కనకయ్య ,వైరా కు చెందిన విజయాబాయి లు పొంగులేటి వెంట ఉన్నారు . జనరల్ సీట్లలో తప్ప ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 రిజర్వుడ్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు .
మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా పొంగులేటి వెంట నడిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం . ఇప్పటికే రహస్య సమావేశాలు జరుగుతున్నాయి. దానిపై బీఆర్ యస్ పార్టీ నిఘా పెట్టింది. పొంగులేటి మాత్రం ఉమ్మడి జిల్లాలో తన దూకుడు ఆపడంలేదు .తన రాజకీయ ప్రయాణం ఏదైనా తన వెంట వచ్చేవారికి భరోసా కల్పించాలని పట్టుదలతో అడుగులు వేస్తున్నారు . బీజేపీ లేదా కాంగ్రెస్ , షర్మిల పార్టీలు ఆయన రావాలని కోరు కుంటున్నాయి. అయితే ఆయన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు .అయితే కొన్ని పార్టీలవారు
కలిసినమాట నిజమేనని ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు . ఆయన వేసే అడుగులపై తన వెంట తిరిగే అనుయాయుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మొదటినుంచి పొంగులేటి అనుయాయుడిగా ఉన్న డాక్టర్ దయానంద్ మాత్రం తాను కాంగ్రెస్ లో చేరితేనేవెంట వస్తానని అన్నట్లు సమాచారం. దీంతో కొద్దీ రోజులు పొంగులేటి పర్యటనలకు దూరంగా దయానంద్ ఉన్నారు . ఇటీవల ఆయనకు హార్ట్ ఎటాక్ తో హైద్రాబాద్ హాస్పటల్ లో ఉన్నారు . అక్కడకు వెళ్లి పొంగులేటి దయానంద్ ను కలిసి పరామర్శించారు . మళ్ళీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని అంటున్నారు . అయితే ఇది ఎలాంటిది ఆయన దారికి ఈయన వచ్చారా ? ఈయన దారికి ఆయన వెళ్ళారా అనేది చూడాల్సి ఉంది . మొత్తానికి పొంగులేటి తీసుకొనే రాజకీయ నిర్ణయం పై జిల్లా రాజకీయాలు మలుపులు తిరిగే అవకాశం ఉంది ….చూద్దాం ఏమి జరుగుతుందో మరి ….!