Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మరోసారి చైనా బెలూన్ కలకలం… ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!

మరోసారి చైనా బెలూన్ కలకలం… ఈసారి లాటిన్ అమెరికా దేశాలపై!

  • ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కలకలం
  • మిస్సైల్ తో బెలూన్ ను కూల్చివేసిన అమెరికా
  • కొన్నిరోజుల వ్యవధిలో మరో బెలూన్ ప్రత్యక్షం
  • కొలంబియా, కోస్టారికా, వెనిజులా దేశాల మీదుగా పయనం

ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ దర్శనమివ్వడం, అమెరికా ఏఐఎం-9ఎక్స్ సైడ్ వైండర్ క్షిపణితో దానిని కూల్చివేయడం తెలిసిందే. ఆ బెలూన్ ద్వారా తమపై చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. చైనా మాత్రం అది వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన బెలూన్ అని చెబుతోంది.

ఈ నేపథ్యంలో, రెండో బెలూన్ కూడా దర్శనమిచ్చింది. ఇది కూడా చైనాదేనని వెల్లడైంది. ఈ బెలూన్ ను లాటిన్ అమెరికా దేశాల గగనతలంలో గుర్తించారు. అయితే లాటిన్ అమెరికా దేశాలు ఈ బెలూన్ ను తేలిగ్గా తీసుకున్నాయి.

ఈ రెండో బెలూన్ ను మొదట గుర్తించింది అమెరికా రక్షణశాఖే. అమెరికా గగనతలంపై ఎగిరిన బెలూన్ తరహాలోనే ఉండడంతో ఇది కూడా చైనాదేనని నిర్ధారణకు వచ్చారు. చైనా కూడా ఆ రెండో బెలూన్ తమదేనని స్పష్టం చేసింది. ఈ బెలూన్ కొలంబియా, వెనిజులా, కోస్టారికా మీదుగా పయనించినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఆ బెలూన్ ఎక్కడుందన్నది తెలియరాలేదు. చైనాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు కలిగిన లాటిన్ అమెరికా దేశాలు దీని గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, అమెరికా రక్షణ శాఖ మాత్రం దీనిపై తప్పకుండా ఓ కన్నేసి ఉంచుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related posts

అన్న వదిలిన బాణం రివర్స్ అయి0ది …షర్మిల కా0గ్రెస్ లో చేరికపై చంద్రబాబు

Ram Narayana

జర్నలిస్టుల సమస్యలపై వ్య .కా రాష్ట్ర సభల్లో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు .. .టి యూ డబ్ల్యూ జే (ఐజేయూ )

Drukpadam

చంద్రబాబు అనే నేను… ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ చీఫ్…

Ram Narayana

Leave a Comment