Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తనకు ఇష్టమైన జర్నలిస్ట్ నేత శ్రీనివాస్ రెడ్డి …మంత్రి పువ్వాడ…

తనకు ఇష్టమైన జర్నలిస్ట్ నేత శ్రీనివాస్ రెడ్డిమంత్రి పువ్వాడ
ఐజేయూ ఖమ్మం డైరీ ఆవిష్కరణ సభలో శ్రీనివాస్ రెడ్డి నాయకత్వ పటిమను ప్రశంసించిన మంత్రి
ఆయనకు తనతండ్రి నాగేశ్వరరావు గారితో అనుబంధం వీడదీయలేనిది
జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడే సంఘం ఐజేయు..
జర్నలిస్టు డైరీ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది..
కంటిన్యూగా డైరీ తెస్తున్న సంఘానికి అభినందనలు

తనకు ఇష్టమైన జర్నలిస్ట్ ఉద్యమనేత శ్రీనివాస్ రెడ్డి …ఆయన నాయకత్వం పటిమ గురించి దగ్గరనుంచి చూసిన వాణ్ణి అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు … తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కు అత్యంత సన్నిహితులు తనకు ఇష్టమైన సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరెడ్డి జాతీయ అధ్యక్షులు గా పని చేస్తు ఆయన నాయకత్వం వహిస్తున్న సంఘం అంటే తనకు అభిమానం… ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు .. ఆయన నాయకత్వం వహిస్తున్న ఐజేయూ సంఘం డైరీ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది అని అన్నారు . మంగళవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఖమ్మం జిల్లా టి యూ డబ్ల్యూ జె (ఐజేయూ ) డైరీ ఆవిష్కరణలో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని డైరీని ఆవిష్కరించారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ , జర్నలిస్టుల హక్కుల సాధన కోసం దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసే సంఘం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ కు మంచి గుర్తింపు ఉందని అన్నారు . టి యు డబ్ల్యూ జే ఆధ్వర్యంలో అందమైన డైరీని రూపొందించడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టులు అనేక హక్కులను సాధించుకున్నారని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పని చేసే జర్నలిస్టు నాయకులందరి కి ఆయన అభినందనలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రామనారాయణ మాట్లాడుతూ డైరీని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో మంత్రిని జర్నలిస్ట్ నాయకులు అందరితో కలిసి రాం నారాయణ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేతా , బీఆర్ యస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ , టియుడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరరావు ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు నరవనేని వెంకట్రావు ఐ, జె యు నగర అధ్యక్ష కార్యదర్శులు మైస పాపారావు ఉషోదయం శ్రీనివాస్ ఐ జె యు జిల్లా కోశాధికారి శివానంద జిల్లా ఉపాధ్యక్షులు మొహిద్దిన్ తాతా శ్రీనివాసరావు జిల్లా నాయకులు యోగి నాటి మాధవరావు నామ పురుషోత్తం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కామటం శ్రీనివాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్ సామినేని మురారి. హన్స్ ఇండియా సత్యనారాయణ , టీవీ 5 వాసు , ప్రెస్ క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి , కోశాధికారి నామ పోరుషోత్తం …సూర్య సత్యనారాయణ , మధు , ఆంధ్రప్రభ బాబురావు , వేణు , బసవేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు .

 

Related posts

ఐఎంపీఎస్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచిన స్టేట్ బ్యాంక్!

Drukpadam

గతేడాది ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోని ముఖేశ్ అంబానీ…

Drukpadam

జయలలిత చివరి రోజుల్లో చదివిన ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మావో జెడాంగ్ పుస్తకం!

Drukpadam

Leave a Comment