Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

లాఠీపట్టడమే కాదు … సహాయం చేయడంలో మిన్న దటీజ్ సజ్జనార్

లాఠీపట్టడమే కాదు … సహాయం చేయడంలో మిన్న దటీజ్ సజ్జనార్
– సైబరాబాద్ పోలీసులు … వందనం అంటున్న ప్రజలు
-కరోనా భారిన పడ్డవారి పిల్లల సంరక్షణ భాద్యత తీసుకున్న సజ్జనార్
-డే కేర్ సెంటర్లను చైల్డ్ కేర్ సెంటర్లుగా మార్పు
-తల్లిదండ్రులకు నెగిటివ్ వచ్చే వారి భాద్యత తమదే అంటున్న సజ్జనార్
-సైబరాబాద్ పోలీసులు మరోసారి మానవత్వం శబాష్ అంటున్న ప్రజలు
సజ్జనార్ పోలీస్ అధికారిగా తెలుగు రాష్ట్రాలలో చిరపరిచితులు …హంతకుల పాలిట సింహ స్వప్నం … మాఫియాలకు దడపుట్టించిన నికార్సైన పోలీస్ ఆఫీసర్ … మంచిని మంచి చెడును చెడు అనే చెప్పగలిగే నిజాయతి పరుడైన సజ్జనార్ ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజల ఆలోచనలకు ,చట్టపరిధిలోనే ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వేళ ఒక మంచి నిర్ణయం తీసుకొని శబాష్ అనిపించుకుంటున్నారు. అనేక కుటుంబాలు కరోనా భారిన పడుతున్నాయి. కొందరు ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఉంటూ ఆ వ్యాధి భారిన పడితే వారిపిల్ల పోషణ భారంగా మారింది. నా అనే వాళ్ళు లేక తమ పిల్లలను చూసే వారు లేక కరోనా భారిన పడి హాస్పటల్స్ లో క్వారంటైన్ లో ఉంటున్న వారు తమ పిల్లల ఆలన పాలనపై భోరున విలపిస్తుంటే చాలించి పోయిన సజ్జనార్ ఒకనిర్ణయానికి వచ్చారు .
కరోనా కష్టకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు అండగా ఉంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందించే ఆయన ఈ ఆపత్కాలంలో మరో గొప్ప నిర్ణయం తీసుకుని అందరి మనసులు గెలుచుకున్నారు.

ఈ మేరకు ఆయన కొన్ని నిర్ణయాలు వెల్లడించారు.

హైదరాబాద్‌నగరంలో ఎవరికైనా కరోనా వస్తే వారి పిల్లలను తమ సంరక్షణలో ఉంచుకుంటామని తెలిపారు .

ఇప్పుడున్న డేకేర్ సెంటర్లను చైల్డ్‌కేర్ సెంటర్లుగా మారుస్తున్నామని వివరించారు.

తల్లిదండ్రులకు కరోనా వచ్చి పిల్లలకు రాకుంటే ఆ పిల్లలను తల్లిదండ్రులకు నెగెటివ్ వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటామన్నారు.

పిల్లల పూర్తి బాధ్యతను తామే చూసుకుంటామని, ఎలాంటి ఖర్చు లేకుండా తామే చైల్డ్ కేర్ సెంటర్‌లో అన్నీ అందిస్తామన్నారు.

ఎవరికైనా సాయం కావాల్సి వస్తే సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 080-45811215కి కాల్ చేయాలని కోరారు.

ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దని, తాము అన్ని రకాలుగా పిల్లలకు, తల్లిదండ్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎంతైనా సైబరాబాద్ పోలీసులు గ్రేట్ కదా. అందుకే సజ్జనార్ ,సజ్జనార్ అంటున్నారు జనం …

Related posts

270 మంది కొవిడ్ బాధితులను కాపాడిన వైద్యుడు!

Drukpadam

బ్రిటన్‌లో ఒకే రోజు 93 వేలకుపైగా ఒమిక్రాన్ కేసులు

Drukpadam

ఆక్సీజనరేటర్ల ఏర్పాటుతో ఆక్సిజన్ కొరత తీర్చొచ్చు: డాక్టర్ కేవీరావు…

Drukpadam

Leave a Comment