Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రెండు నెలల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు …ఎమ్మెల్యే వెంకటవీరయ్య …

రెండు నెలల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలుఎమ్మెల్యే వెంకటవీరయ్య
మంత్రి హరీష్ రావు చేతులమీదుగా పంపిణి చేస్తాం
ఎంపిక భాద్యత కలెక్టర్ కు అప్పగిస్తాం
అర్హులైన అందరికి న్యాయం చేస్తాం
భద్రతా లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు , సంక్షేమ పథకాలు అమలు చేసిఆదుకోవాలని కోరిన రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ
సభలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

 

సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి రెండు నెలల్లో ఇళ్లస్థలాలు వచ్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వెంకటవీరయ్య అన్నారు . సోమవారం సత్తుపల్లి నియోజకవర్గం టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) మహాసభలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు . ఈసందర్భంగా ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు . నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి ఆయా మండలంలో స్థలాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు . ఇప్పటికే పెనుబల్లి విలేకర్లకు స్థలాలు గుర్తించడం జరిగిందని అన్నారు . మంత్రి హరీష్ రావు జిల్లాకు వచ్చినప్పుడు ఆయన చేతులమీదుగా వారికీ స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు . ఒక్క తల్లాడ మండల కేంద్రాల్లో తప్ప అన్ని చోట్ల స్థలాలు ఉన్నాయని గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్థలం పొందని వారిని గుర్తించి వారికీ స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు . ఇందులో యూనియన్ లకు సంబంధం లేకుండా అర్హులైనవారికి ఇచ్చేలా జిల్లా కలెక్టర్ కు భాద్యత అప్పగించడం జరుగుతుందని అన్నారు .

అంతకు ముందు సభలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షలు కె .రాంనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా ఇళ్లస్థలాలు , హెల్త్ కార్డులు , సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ కోరారు .తమ యూనియన్ కు ఏపార్టీ తో సంబందం లేదని అధికార పార్టీ బీఆర్ యస్ కు వ్యతిరేకం కాదని తమ సంఘంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలూ కలిగినవారు ఉన్నారని అన్నారు . చాలీచాలని వేతనాలతో , భద్రతా లేని ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు . ఈమేరకు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో , హెల్త్ కార్డుల విషయంలో తమ సంఘం మంత్రుల దృష్టికి తుసుకొని పోయిందని వారు సానుకూలంగా స్పందించారని అన్నారు,

మహా సభ కు సీనియర్ జర్నలిస్ట్ నాయకుడు షేక్ ఖాదర్ బాబా అధ్యక్షత వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరావు లు , ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ కనకం సైదులు రాష్ట్ర నాయకులూ నేర్వనేని వెంకట్రావు , సామినేని కృష్ణ మురహరి , జిల్లా నాయకులూ మొహినుద్దీన్ ,ఎగినాటి మాధవరావు ,కూరాకుల గోపి , జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ,గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , చెరుకుపల్లి శ్రీనివాస్ ,జనార్దనాచారి, సత్యనారాయణ , మధు , రాజారావు , శ్రీనివాస్ ,రామారావు , దేవా తదితరులు పాల్గొన్నారు .

2023 డివిజన్ కమిటీ ఎన్నిక జరిగింది. నూతన డివిజన్ కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రింట్ మీడియా డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు (పెనుబల్లి) లను ఎన్నుకోగాఎలెక్ట్రానిక్ మీడియా తరుపున అధ్యక్షుడిగా కలవకొలను సతీష్ (జెమిని) , ప్రథాన కార్యదర్శిగా B. రామకృష్ణ (TV3 న్యూస్) లను రాష్ట్ర,జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతనంగా డివిజన్ కమిటీ తో ఎన్నికైన బ్బృందానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు గారు, పాల్గొని జర్నలిస్ట్ లకు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ , ఆత్మ చైర్మన్ శీలపు రెడ్డి హరి కృష్ణారెడ్డి ,బీజేపీ నాయకులూ నంబూరి రామలింగేశ్వరరావు లు పాల్గొన్నారు .

ప్రింట్ మీడియా డివిజన్ అధ్యకుడు నిమ్మగడ్డ శ్రీకాంత్(సూర్య),
ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు కె.సతీష్ (జెమిని)AP TS 24/7
ప్రింట్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ (పెనుబల్లి)
ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి బర్రె.రామకృష్ణ (TV3)
ప్రింట్ మీడియా డివిజన్ ఉపాధ్యక్షులు :
01) సలీమ్ (నమస్తే తెలంగాణ ) పెనుబల్లి
02) ఉబ్బన. చంటి (కల్లూరు)
03) దర్గా (తల్లాడ)
04) పాషా (వేంసూరు)
ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ఉపాధ్యక్షులు :
01) SK. మీరా (NTV)
02) క్రాంతి (కల్లూరు) 6 టీవీ.
ప్రింట్ మీడియా సహాయక కార్యదర్శులు :
01) అబ్బాస్ (కల్లూరు)
02) జనార్ధన్ (పెనుబల్లి)
03)సురేందర్ రెడ్డి (తల్లాడ)
04) వేము.రాంబాబు (కల్లూరు)
ప్రింట్ మీడియా డివిజన్ ప్రచార కార్యదర్శి :
01) సుఖబోగి. రాము
02)కిరణ్ సూర్య (పెనుబల్లి)
03) విజయ్ (తల్లాడ)
04) కె.అశోక్ రాజా (సత్తుపల్లి)
ప్రింట్ మీడియా డివిజన్ కోశాధికారి :
01) SK. మున్నీర్ (సూర్య)

ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ సహాయక కార్యదర్శులు:
01) తల్లాడ.రాంబాబు (CVR న్యూస్)
02)వేము చందు
03) కొత్తపల్లి సుధాకర్ (దిశ టీవీ)

ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార కార్యదర్శి:
01) రామకృష్ణ (బిగ్ టీవీ)
వీరితో నూతన డివిజన్ కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. అవసరాన్ని బట్టి మరికొందరిని కో ఆప్ట్ చేసుకోవాలని సమవేశం నిర్ణయించింది

Related posts

రేవంత్ రెడ్డిపై సోనియాకు ఫిర్యాదు… ఆయన కూడా సీరియస్ ?

Drukpadam

హైద్రాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ యస్ స్వల్ప ఆధిక్యం

Drukpadam

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై ఎందుకు దాడి జ‌ర‌గ‌లేదు?: మంత్రి విశ్వ‌రూప్‌

Drukpadam

Leave a Comment