Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వీధికుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షలు!

వీధికుక్కల దాడిలో మృతిచెందిన బాలుడి కుటుంబానికి రూ.10 లక్షలు!

  • ఇటీవల అంబర్ పేటలో దారుణం
  • కుక్కలు దాడి చేయడంతో ఐదేళ్ల బాలుడి మృతి
  • నేడు అన్ని పార్టీల కార్పొరేటర్లతో మేయర్ విజయలక్ష్మి భేటీ
  • కుక్కల నివారణకు కమిటీ వేయాలని నిర్ణయం

ఇటీవల హైదరాబాదులో ఐదేళ్ల చిన్నారి వీధికుక్కల దాడిలో మృతి చెందడం తెలిసిందే. ఆ బాలుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రకటించింది. హైదరాబాదులో ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశం జరిగింది.

బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.8 లక్షలు ప్రకటించగా, కార్పొరేటర్లు తమ ఒక నెల వేతనంతో మరో రూ.2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, కుక్కల నివారణకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Related posts

మహాత్మాగాంధీ చివరి పర్సనల్ సెక్రటరీ వి.కల్యాణం మృతి

Drukpadam

అభివృద్ధిలో తెలంగాణకు ఖమ్మం ఆదర్శం … మంత్రి కేటీఆర్

Drukpadam

విచారణకు రావాలంటూ… హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కి ఈడీ స‌మ‌న్లు!

Drukpadam

Leave a Comment