Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీ అందుకే పెళ్లి చేసుకోలేదట .. బీజేపీ ఎంపీ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు!

రాహుల్ గాంధీ అందుకే పెళ్లి చేసుకోలేదు.. బీజేపీ ఎంపీ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • పిల్లలు పుట్టరని తెలిసే రాహుల్ పెళ్లి చేసుకోలేదన్న బీజేపీ కర్ణాటక చీఫ్ 
  • కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్, సిద్ధరామయ్య ప్రచారం చేశారని మండిపాటు
  • ఆయన తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కాంగ్రెస్ ట్వీట్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ కర్ణాటక చీఫ్ నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని రామనగరలో ఆదివారం నిర్వహించిన జన సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దని, అది తీసుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ప్రచారం చేశారని కానీ, రాత్రిపూట రహస్యంగా వారిద్దరూ ఆ వ్యాక్సిన్ తీసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని అన్నారు. ఇదే విషయాన్ని తమ ఎమ్మెల్సీ మంజునాథ్ కూడా చెప్పారని అన్నారు. 

నళిన్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీలో అందరికీ ఉన్నట్టుగా నళిన్ కుమార్‌కు కూడా తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించింది. ‘గెట్‌ వెల్ సూన్ బీజేపీ’ అని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ట్వీట్ చేశారు. బీజేపీ సర్కస్‌లో కటీల్ ఒక జోకర్ అని, ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts

స్టెల్లా నౌకలో 1,320 టన్నుల రేషన్ బియ్యం…

Ram Narayana

పర్యాటకులకు గమనిక.. నేడు, రేపు పాపికొండల విహారయాత్ర రద్దు..!

Drukpadam

బిర్యానీ తిని రూ. 7 లక్షల విలువైన కారు గెలుచుకున్న అదృష్టవంతుడు!

Ram Narayana

Leave a Comment