ఏపీ సీఎం జగన్ కు ఢిల్లీ పిలుపు …ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ !
-నేడు ఢిల్లీకి జగన్… మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం
-సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న జగన్
-రేపు మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం
-విశాఖ నుంచి పాలనపై సమాచారం ఇచ్చే అవకాశం
ఏపీ సీఎం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి కి ఢిల్లీకి రావాలని ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు . కేంద్రప్రభుత్వం తో సఖ్యతతో ఉండి ప్రధాని మోడీకి నమ్మకమైన సీఎం లలో జగన్ ఒకరు . దీంతో ప్రధానిని తరుచు కలవడం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై చర్చించించి రాబట్టుకోవడం జగన్ తరుచు చేస్తున్నారు . రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా జగన్ అడుగులు వేస్తున్నారు.
ఫలితంగా పీఎం మోడీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో జగన్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. జగన్ ఉన్నట్టుండి హస్తినకు బయల్దేరనుండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, రాష్ట్ర సమస్యలను మోదీ, అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. కొందరు కేంద్ర మంత్రులతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.