Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణలోకి వచ్చే కోవిడ్ రోగులకు హాస్పిటల్ లేఖతో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ పాసులు తప్పనిసరి : డిఐజి రంగనాధ్

తెలంగాణలోకి వచ్చే కోవిడ్ రోగులకు హాస్పిటల్ లేఖతో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ పాసులు తప్పనిసరి : డిఐజి రంగనాధ్

నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణలో చికిత్సల నిమిత్తం వచ్చే అంబులెన్స్, వ్యక్తిగత వాహనాలలో, ప్రైవేట్ వాహనాలలో వచ్చే కోవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రుల నుండి జారీ చేసిన లెటర్స్ తో పాటు హైదరాబాద్ లోని వైద్య ఆరోగ్య & ప్రజారోగ్య కోవిడ్ కంట్రోల్ రూమ్ నుండి జారీ చేసిన పాస్ విధిగా ఉండాలని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల నుండి పలువురు కోవిడ్ రోగులు హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స పొందడానికి వచ్చే క్రమంలో సరిహద్దుల వద్ద అంబులెన్స్ లలో కాకుండా వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలోనూ వస్తున్నారని దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం సంబంధిత ఆసుపత్రి ఇచ్చే లెటర్ తో పాటు విధిగా కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేయబడే పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వచ్చే కోవిడ్ రోగులు ఈ అంశాన్ని గమనించి తమతో సహకరించాలని, పాసులు లేకుండా వచ్చి సరిహద్దులలో ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసే క్రమంలో ఆసుపత్రుల లేఖలతో పాటు కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా జారీ చేసే పాసులు విధిగా పొందిన తర్వాతనే తెలంగాణలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
సాదారణ వాహనాలకు పాస్ తప్పనిసరి
అదే విధంగా ఇతర ప్రాంతాల నుండి తెలంగాణలోకి వచ్చే సాధారణ వాహనదారులు, వ్యక్తిగత, ప్రైవేట్ వాహనాలలో వచ్చే ప్రయాణికులంతా విధిగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ విధిగా పొంది ఉండాలని, ఈ పాస్ లేని వారిని సైతం తెలంగాణలోకి అనుమతించడం జరగదని డిఐజి రంగనాధ్ స్పష్టం చేశారు.

Related posts

లిక్కర్ స్కాంతో నాకు సంబంధంలేదు: ఏపీ ఎంపీ మాగుంట!

Drukpadam

తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు ముహూర్తం ఫిక్స్ …?

Drukpadam

నవంబరు నుంచి వాట్సాప్ సేవలు ఈ క్రింద మొబైల్స్‌లో బంద్ కానున్నాయి!

Drukpadam

Leave a Comment