Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తన కోసమే గ్రూప్-1 పేపర్ కొట్టేసిన ప్రవీణ్!

తన కోసమే గ్రూప్-1 పేపర్ కొట్టేసిన ప్రవీణ్!

  • సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి
  • సిట్ అదుపులో ఏ1 నిందితుడు ప్రవీణ్
  • తాను కొట్టేసిన పేపర్ ను మరో ముగ్గురికి ఇచ్చిన ప్రవీణ్

ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో సిట్ విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదట ప్రవీణ్ అనే టీఎస్పీఎస్ లో ఉద్యోగి అనే విషయం విదితమే …అయితే అతనితో పాటు మరో ముగ్గురికి ప్రశ్నపత్రాలు అందజేశారు . ఇది బయటకు రావడం పై గుట్టుచప్పుడు కాకుండా జరిగిన పరిణామాలపై సిట్ లోతుగా విచారణ జరుపుతుంది. ఇప్పటికే అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారణ జరిపిన సిట్ మరికొంతమందిని విచారణ జరపాలని నిర్ణయించుకుంది . ఇదే కాకుండా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షల్లోనూ 12 పాత్ర ఉన్నట్లు కూడా సిట్ తన విచారణలో గుర్తించినట్లు తెలుస్తుంది.

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో ఏ1 నిందితుడు ప్రవీణ్ ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రవీణ్ తన కోసమే గ్రూప్-1 పేపర్ కొట్టేశాడని గుర్తించారు. ఆ పేపర్ ను ప్రవీణ్ టీఎస్ పీఎస్సీలోని మరో ముగ్గురు ఉద్యోగులకు ఇచ్చాడు. మొత్తమ్మీద గ్రూప్-1 పేపర్ ఐదుగురికి చేరినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. సిట్ అధికారులు ఇప్పటివరకు 84 మంది గ్రూప్-1 అభ్యర్థులను ప్రశ్నించారు. అటు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే 12 మంది వద్దకు చేరినట్టు గుర్తించారు.

Related posts

అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

Ram Narayana

నట్టింట్లో తల్లి శవం.. ఆస్తుల కోసం కూతుళ్ల కొట్లాట!

Ram Narayana

టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ హాసన్ ఆత్మహత్యాయత్నం…

Ram Narayana

Leave a Comment