Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వండి …. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి భావిరంగా లేఖ …

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వండి …. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి భావిరంగా లేఖ …
-2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్
-పోడుభూముల కోసం గిరిజనుల్లో , ఆదివాసుల్లో ఆందోళన

ఇదిగో పోడు భూములకు హక్కు పత్రాలు …అదిగో పత్రాలు అంటూ కాలయాపన చేస్తున్న కేసీఆర్ సర్కారుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . 2018 ఎన్నికలకు ముందు పోడుభూముల పరిష్కరానికి నెలరోజుల్లో నేను వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని దాన్ని గత నాలుగు సంవత్సరాలుగా మర్చిపోయి తిరిగి ఎన్నికలు వస్తున్నందున పొదుపత్రాలు ఇస్తామని చెపుతున్నారు తప్ప ఇవ్వడంలేదని విమర్శించారు . ఇప్పటికైనా హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు .

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గం పోలంప‌ల్లి గ్రామంలో సోమ‌వారం పాద‌యాత్ర‌లో లేఖ‌ను విడుద‌ల చేసిన సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌
ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునేందుక మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టానని ప్రజలు పోడుభూముల పట్టాల గురించి అడుగుతున్నారని అన్నారు .

18 రోజులుగా ఆదిలాబాద్, ఆసీఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తనకు వేలాది మంది గిరిజనులు, ఆదివాసీలు కలిసి పోడుభూములతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలని వివరించారని తెలిపారు . 14 లక్షల ఎకరాల పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నారని ప్రభుత్వం మొదట 11 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పి చివరకు 4 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి అదిగో ,ఇదిగో అనడం అన్యాయం అని భట్టి ప్రభుత్వ చర్యను తప్పు పట్టారు .

కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాల భూములను బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ద్వారా హక్కులు కోల్పోయామని, తమ భూముల్లోకి రాకుండా అటవి అధికారులు పెడుతున్న ఇబ్బందులను చెప్పి కన్నీటి పర్యంతమయ్యారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు .

Related posts

నాడు రోశయ్య అసెంబ్లీకి ఉరితాడు తెచ్చుకుంటే వద్దని వారించాం: సీఎం కేసీఆర్!

Drukpadam

ఉద్యోగ ప్ర‌క‌ట‌న స‌రే.. ఎప్ప‌టిలోగా భ‌ర్తీ చేస్తారు?: రేవంత్ రెడ్డి

Drukpadam

కేటీఆర్ కనిపించుటలేదు’… హైదరాబాద్ నగర శివార్లలో నిరసన పోస్టర్లు….

Drukpadam

Leave a Comment