- ఫేస్‌బుక్ ద్వారా యువతితో పరిచయం
- కలుద్దాం రమ్మంటూ కిడ్నాప్
- అడవిలోకి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారం
హర్యానాలో జరిగిన ఓ అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై 25 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పల్వాల్ జిల్లాలో ఈ నెల 3న ఈ ఘటన జరగ్గా బాధితురాలు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
బాధిత యువతికి నిందితుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. స్నేహం మరింత ముదరడంతో కలుద్దామని యువతిని పిలిచి కిడ్నాప్ చేసి రామ్‌గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ రాత్రి స్నేహితులతో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ఉదయం మరోమారు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బదార్‌పూర్ సరిహద్దు వద్ద వదిలేసి పరారయ్యారు. యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.