Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బిజెపి కాంగ్రెస్ పార్టీల ది గ్లోబల్ ప్రచారం.. బీఆర్ యస్ ప్లినరీ లో తాతా మధు!

బిజెపి కాంగ్రెస్ పార్టీల ది గ్లోబల్ ప్రచారం.. బీఆర్ యస్ ప్లినరీ లో తాతా మధు!
-దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ
-తెలంగాణ వైపు చూస్తున్న వివిధ రాష్ట్రాలు
-ఎప్పుడు ఎన్నికలు జరిగినా సీఎం కెసిఆర్ కు హ్యాట్రిక్ విజయం ఖాయం -అందుకు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు ..

బీఆర్ యస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోసం ఒక్క తెలంగాణ ప్రజలే కాకుండా యావత్తు దేశం ఎదురు చూస్తుందని ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ అన్నారు . గురువారం హైద్రాబాద్ లోని బీఆర్ యస్ భవనంలో జరిగిన పార్టీ ప్లినరీ సమావేశంలో మధు చేసిన ప్రసంగం , సూచనలు పార్టీ ప్రతినిధులు ,పెద్దలను ఆలోచింప జేశాయి. పార్టీ నేతలకు అందించిన వివిధ సలహా సూచనలపై బిఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేసి ఆయన్ను అభినందించారు . పార్టీ సమావేశంలో ప్రవేశ పెట్టిన తీర్మానాలపై మధు వాటిని బలపరుస్తూ అనేక సూచనలు చేశారు . ఈసందర్భంగా పార్టీ పనితీరు కేసీఆర్ మార్గదర్శకత్వం పై కొనియాడుతూ ఆయన అడుగు జాడల్లో పార్టీని బలోపేతం చేయాలనీ అందుకు తీసుకోవాల్సిన చర్యలపై మధు ప్రసంగించిన తీరు ప్రతినిధులను ఆకట్టుకున్నది .

హట్రిక్ విజయం మనదే..

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిన ఆవశ్యకతను మధు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు నిత్యం ప్రజల్లోనే ఉంటూ బిజెపి, కాంగ్రెస్ పార్టీల గ్లోబల్ ప్రచారాలకు దీటైన సమాధానం చెప్పాలని కోరారు. తెలంగాణను సాధించుకుని సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తిరిగి పొందే అర్హత హక్కు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ , రైతు బంధు , దళిత బంధు , పెన్షన్ లు సంక్షేమ పథకాలు ,పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనీ అన్నారు .

నియోజకవర్గాల స్థాయిలో సీఎం కెసిఆర్ సారథ్యంతో రాష్ట్రానికి జరుగుతున్న సంక్షేమాన్ని వివరిస్తూనే పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు వివరించారు. ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అందించిన సలహా సూచనలపై పెద్ద ఎత్తున పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరు అయ్యారు.

Related posts

రాజీనామా చేసేందుకు ఇంటి నుండి బయటకు వచ్చి.. మళ్లీ ఇంట్లోకి వెళ్లిన మణిపూర్ సీఎం…

Drukpadam

కశ్మీర్ లో ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చుకోలేం.. అది ఎవరి వల్ల కాదు:ఆజాద్

Drukpadam

ఖమ్మం కారు లో  మరో ఇద్దరు ప్రజాప్రతినిదులు …

Drukpadam

Leave a Comment