Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

స్టాలిన్ ఆదేశాలతో బాధితుడికి జరిమానా డబ్బును వెనక్కి ఇచ్చిన పోలీసులు
హెల్మెట్ లేదంటూ రూ. 500 జరిమానా విధించిన పోలీసులు
దీంతో కొడుక్కి మందులు కొనలేకపోయిన బాధితుడు
ట్విట్టర్ ద్వారా స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లిన వైనం
ముఖ్యమంత్రి ఆదేశాలతో తాము వసూలు చేసిన జరిమానాను పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లి తిరిగిచ్చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తిరువళ్లూర్ జిల్లా సెవ్వాపేట సమీపంలోని సిరుకూడల్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల బాలచంద్రన్ కుమారుడు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కొడుక్కి మందులు కొనుగోలు చేసేందుకు గత శుక్రవారం తిరువళ్లూర్ వచ్చాడు. అదే సమయంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు హెల్మెట్ లేదంటూ బాలచంద్రన్ కు రూ. 500 జరిమానా విధించారు.

అయితే, తన కొడుక్కి మందులు కొనేందుకు తన వద్ద కేవలం రూ. 1,000 మాత్రమే ఉన్నాయని, తనకు జరిమానా విధించవద్దని పోలీసులను బాలచంద్రన్ వేడుకున్నాడు. అయినా కనికరించని పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించడంతో… మందులు కొనుక్కోకుండానే అతను ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లారు . అందుకే తమిళనాట ఇప్పుడు దటీస్ స్టాలిన్ అంటున్నారు .

Related posts

వర్షంలోనూ లంక గ్రామల్లో  వరదభాదితులవద్దకు సీఎం జగన్!

Drukpadam

ఏపీ స్పీకర్ తమ్మినేని నోట చట్ట వ్యతిరేక మాట!

Drukpadam

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కీలక ఆదేశాలు…

Drukpadam

Leave a Comment