Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం! 9 మంది దుర్మరణం!

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం! 9 మంది దుర్మరణం!

  • టెక్సాస్ రాష్ట్రం  ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో కాల్పుల కలకలం
  • కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు
  • మరో ఏడుగురికి గాయాలు
  • పోలీసు ఎదురు కాల్పుల్లో నిందితుడి మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రం ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ పరిసరాల్లో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మంది మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. అప్పటికే అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారి నిందితుడిపై ఎదురు కాల్పులు జరిపి మట్టుపెట్టాడు. నిందితుడు ఫుట్‌పాత్‌పై నడుస్తూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడ్డట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. గాయపడ్డవారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు నగర పోలీస్ చీఫ్ బ్రయన్ హార్వీ ప్రకటించారు.

ఈ ఘటనపై స్పందించిన టెక్సాస్ రాష్ట్ర గవర్నర్.. ఇది మాటలకు అందని విషాదమని వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులకు, బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 198 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. 2016 తరువాత ఇదే అత్యధికమని అక్కడి పరిశీలకులు చెబుతున్నారు. 2021లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 49 వేల మంది మరణించగా 2020లో 45 వేల మంది అసువులు బాసారు.

Related posts

పాతిక వేలు ఇస్తే వేలిముద్ర మారిపోయే సర్జరీలు… విదేశాలకు వెళ్లేందుకు అక్రమ మార్గం!

Drukpadam

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. ఆకలితో ఐదురోజులు అల్లాడి మరణించిన 9 నెలల చిన్నారి!

Drukpadam

షర్మిలకు అడుగడుగునా అవమానం అరెస్ట్ …జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

Drukpadam

Leave a Comment