Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డీకే శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన షర్మిల…

డీకే శివకుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన షర్మిల…

  • డీకే శివకుమార్ కు తన హృదయపూర్వక శుభాకాంక్షలంటూ షర్మిల ట్వీట్ 
  • ప్రజలకు సేవ చేసేందుకు ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని వ్యాఖ్య
  • డీకేతో దిగిన ఫొటోను షేర్ చేసిన వైఎస్సార్ టీపీ చీఫ్ 

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియమైన సోదరుడు డీకే శివకుమార్ కు తన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశారు.

‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత వచ్చిన ఈ పుట్టినరోజు మీకు మరింత మధురమైనదిగా.. ముఖ్యమైనదిగా మారింది. కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో షర్మిల ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

ఇక కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డీకే.. తన పార్టీ నేతలను ఏకతాటిపై తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సీఎం రేసులో సిద్ధరామయ్యతో పోటీపడుతున్నారు.

Related posts

ఈ కాలంలో తాగేందుకు ఎన్నో వెరై‘టీ’లు!

Drukpadam

ఎల్కే అద్వానీకి ఇంటికెళ్లి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ

Drukpadam

మునుగోడు టీఆర్ యస్ దే అంటున్న సర్వేసంస్థలు…

Drukpadam

Leave a Comment