Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వద్దిరాజు తిరిగి ఎంపీనేనా …? ఎమ్మెల్యేనా …??

వద్దిరాజు తిరిగి ఎంపీనేనా …? ఎమ్మెల్యేనా …?
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ యస్ లో భారీ మార్పులకు అవకాశం
సిట్టింగులకు తిరిగి సీట్లు కేటాయంపుపై మల్లగుల్లాలు
నలుగురైదుగురు సీట్లు మారె అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రచారం
గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక
పార్టీ మారిన కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి

 

జిల్లాలో ఏకైక బీసీ నేతగా రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వద్దిరాజు రవిచంద్రను సీఎం కేసీఆర్ తిరిగి రాజ్యసభకే పంపుతారా …? లేక ఎమ్మెల్యేగా పోటీచేయిస్తారా …?అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రగతి భవనం ఆదేశాలను తూచ తప్పకుండ పాటిస్తూ కేసీఆర్ భక్తుడుగా మారిన వద్దిరాజు రాజకీయ భవిష్యత్ పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీఆర్ యస్ లో చేరిన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో తనవంతు పాత్ర పోషించారు . ఆయన పనితీరు గమనించిన కేసీఆర్ , కేటీఆర్ లు రెండు సంవత్సరాల కోసం ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటుకు ఆయన్ను ఎంపిక చేసి పంపించారు .అప్పుడే సీఎం కేసీఆర్ తిరిగి ఆరు సంవత్సరాలకు వెళ్లుదువన్నారు . ఇప్పటికే ఆయన రాజ్యసభ కాలం దాదాపు సంవత్సర కాలం పూర్తీ కావస్తుంది. మరో ఏడాది మాత్రమే ఉంది . మరో ఐదు ,ఆరు నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో అనేక మంది సిట్టింగులను మార్చుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ను అసెంబ్లీకి పోటీచేయమని కేసీఆర్ ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగేతే ఆయనకు ఎక్కడ సీటు ఇస్తారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర చివరివరకు కాంగ్రెస్ నుంచి ఖమ్మం అసెంబ్లీ టికెట్ ఆశించారు .టీడీపీలో పొత్తులో భాగంగా ఆసీటు నామ నాగేశ్వరరావు కు కేటాయించారు . దీంతో తప్పని పరిస్థితిలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేశారు .నామినేషన్ వేసే రోజునే అక్కడకు వెళ్లి అతితక్కువ సమయంలో 55 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఆయన ఇప్పటికి ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ సీట్లలో ఎదో ఒక సీటులో అధినేత ఆదేశిస్తే పోటీచేయాలని ఆలోచనతో ఉన్నారు .

ఈసారి కొత్తగూడెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమా వెంకటేశ్వరరావు వయసు పైబడినందున ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు .పైగా వద్దిరాజు కూడా అదే సామాజికవర్గానికి చెందినవారు అయినందున కొత్తగూడెం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ సీటును కాపు సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు కూడా ఆశిస్తున్నారు. పదే పదే కేసీఆర్ ను కలుస్తూ ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 2014 ఎన్నిలల్లో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి జిల్లాలో గెలిచి ఏకైక నాయకుడిగా నిలిచిన జలగం వెంకట్రావు పోటీకి సిద్దపడుతున్నారు .అయితే పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం సీటు సిపిఐ కోరుతుంది. సిపిఐ కి కేటాయిస్తే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పోటీచేస్తారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ సీట్లలో రెండు లెఫ్ట్ పార్టీలు కోరుతున్నాయి. ఖమ్మం లో ఏదైనా ఆశ్చర్యకరమైన నిర్ణయం జరిగితే తప్ప మంత్రి పువ్వాడ అజయ్ పోటీ ఖాయం…. …. పాలేరు లో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పోటీపై సందేహాలు ఉన్నాయి . తిరిగి బీఆర్ యస్ పోటీచేయడం జరిగితే కందాలకే ఇస్తారా …? లేక మాజీ మంత్రి తుమ్మలకు కేటాయిస్తారా …? పొత్తులో భాగంగా ఇప్పటికే సిపిఎం కు ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. సిపిఎం కు కేటాయిస్తే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పోటీచేసే అవకాశం ఉంది. సిపిఎం నియోజకవర్గంలో కేంద్రీకరించింది. తమ్మినేని విస్తృత పర్యటనలు చేస్తున్నారు.

వైరా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ కు సీటు ఇస్తారా …? లేక మదన్ లాల్ .చంద్రావతి వైపు చూస్తారా …?

జిల్లాలో మరో కీలక నియోజకవర్గం వైరా …గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి పొత్తులో భాగంగా అది రాకపోయేసరికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన లావుడ్య రాములు నాయక్ అధికార అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై విజయం సాధించారు .ఈసారి రాములు నాయక్ కు ఇవ్వకపోవచ్చునని ప్రచారం జరుగుతుంది. మదన్ లాల్ , లేదా చంద్రావతిలలో ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చు …

మధిర నియోజకవర్గం నుంచి సీఎల్పీ నేత భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ గత మూడు సార్లుగా భట్టిపై పోటీచేసి ఓడిపోయినా జడ్పీ చైర్మన్ లింగాల కు ఇస్తారా లేక మరో అభ్యర్థి వైపు చూస్తారా ..? అనే సస్పెన్స్ కొనసాగుతుంది.

సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా సండ్ర వెంకటవీరయ్య తిరిగి పోటీచేయడం ఖాయం .మూడు సార్లు టీడీపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు పై గెలిచిన సండ్ర మొదటిసారిగా అధికార పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపై పోటీచేయబోతున్నారు . ఈ నియోజకవర్గంపై ఏపీ రాజకీయాల ప్రభావం ఉంటుంది.నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకునేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు .

అశ్వారావు పేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వరావు గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్నికై బీఆర్ యస్ లో చేరారు .తిరిగి ఆయనకే టికెట్ అంటున్నారు .ఇది కూడా ఏపీ బోర్డర్ నియోజకవర్గం..ఇక పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన రేగా కాంతారావు తర్వాత అధికార టీఆర్ యస్ కు జైకొట్టారు . ఇప్పుడు ఆయన టికెట్ పై సందేహాలు ఉన్నాయని అంటున్నారు . బీజేపీ లోకి వెళతారని అనుకున్న నలుగురు ఎమ్మెల్యేల్లో రేగా ఒకరు .అయితే బీజేపీ చర్యలను పసిగట్టి కుట్రను బయట పెట్టేందుకే వారు చేసిన కృషిని సీఎం కేసీఆర్ ప్రసంశించారు …

ఇల్లందు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన హరిప్రియ అధికార పార్టీలో చేరారు .దీనిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.ఆమె టికెట్ పై సందేహాలు ఉన్నాయి.ఇప్పటికే 40 ఎమ్మెల్యేలను మార్చుతారని జరుగుతున్న ప్రచారం ఉంది. కొందరు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా సీఎం చెప్పారు . ప్రధానంగా దళిత బంధు లబ్ధిదారుల వద్ద ఒక్కొక్క ఎమ్మెల్యే 3 లక్షల వరకు తీసుకొన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లోలో కూడా కొంతమంది ఆ జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది . భద్రాచలం నుంచి గతంలో పోటీచేసిన డాక్టర్ తెల్లం వెంకట్రావు పొంగులేటి వెంట ఉన్నారు .పొత్తు ఉంటె ఈ నియోజకవర్గం సిపిఎం కు కేటాయిస్తారు .లేకపోతే కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉంది….

Related posts

బీజేపీ ,జనసేన కలిసే పోటీచేస్తాయి..బీజేపీ ఎంపీ సుజనా చౌదరి …

Drukpadam

తిరుపతి ఎన్నిక రద్దు చేయాల్సిందే టీడీపీ ,బీజేపీ డిమాండ్ …

Drukpadam

ఏపీ లో టీడీపీ వైసీపీ మధ్య యాడ్స్ యుద్ధం!

Drukpadam

Leave a Comment