Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా వ్యాక్సినేషన్ నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం…

కరోనా వ్యాక్సినేషన్ నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం…
-వ్యాక్సినేషన్ పై నిపుణుల కమిటీ సిఫారసులు
-కరోనా నయమైన వారు 3 నెలల తర్వాతే టీకా పొందాలన్న కేంద్రం
-బాలింతలు వ్యాక్సిన్ తీసుకోవచ్చని వెల్లడి
-వ్యాక్సినేషన్ కు ముందు యాంటీజెన్ పరీక్షలు అవసరంలేదని స్పష్టీకరణ
కరోనా వ్యాక్సినేషన్ పై నిపుణుల కమిటీ సిఫారసుల నేపథ్యంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు ఇకపై 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఇది 4 నుంచి 8 వారాలు ఉండగా…. ఇప్పుడు దీన్ని 3 నెలలకు పెంచారు. తొలి డోసు తీసుకున్నాక కరోనా సోకినా ఇదే నిబంధన వర్తిస్తుంది. కోలుకున్న తర్వాత 3 నెలలకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇతర వ్యాధులకు ఆసుపత్రిలో చికిత్స పొందినవారు కోలుకున్న తర్వాత 4 నుంచి 8 వారాల వ్యవధితో వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్లాస్మా థెరపీ చేయించుకున్నవాళ్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక 3 నెలలకు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కు ముందు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు అవసరంలేదని కేంద్రం పేర్కొంది. బాలింతలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

కరోనా నుంచి కోలుకున్నవారు, వ్యాక్సిన్ పొందినవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చని తాజా మార్గదర్శకాల్లో వివరించారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా!

Drukpadam

ఒమిక్రాన్ వైరస్ ఎఫెక్ట్…మాస్క్ మస్ట్ లేకపోతె రూ 1000 ఫైన్ …తెలంగాణ సర్కార్!

Drukpadam

ఆసుపత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లను చితకబాదిన బంధువులు!

Drukpadam

Leave a Comment