Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

సిపిఐ కొత్తగూడం గర్జన సభ గ్రాండ్ సక్సెస్ …జోష్ లో సిపిఐ…

సిపిఐ కొత్తగూడం గర్జన సభ గ్రాండ్ సక్సెస్జోష్ లో సిపిఐ
లక్ష గొంతుకలు రణనినాదంతో మరుమోగిన కొత్తగూడం
ఆకట్టుకున్న కళాకారుల పాటలు ,ఆటలు
ఎర్రమైయమైన కొత్తగూడం
ఎండని సైతం లెక్క చేయకుండా బహిరంగ సభకు వచ్చిన జన వాహిని

 

సిపిఐ తలపెట్టిన కొత్తగూడెం ప్రజా గర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయింది.దీంతో సిపిఐ లో జోష్ నింపింది . ఎర్రజెండా అభిమానులు పులకించారు . లక్ష గొంతుకలు రణనినాదంతో కొత్తగూడెం మరు మోగింది. కొత్తగూడెం లోని ప్రకాశం స్టేడియం కు అన్ని వైపులనుంచి ప్రజావాహిని కదిలి రావడం చూపరులను ఆకర్షించింది . ఎర్రజెండాలు దండు కదిలిందా అన్నట్లుగా ఉంది కొత్తగూడందారులన్నీ ప్రకాశం స్టేడియం వైపే అన్నట్లుగా మారింది

సభ ప్రారంభానికి ముందు కళాకారుల పాటలు ఆటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సిపిఐ కార్యకర్తలు తరలి వచ్చారు . ఇటీవల కాలంలో సిపిఐ ఆధ్వరంలో జరిగిన పెద్ద బహిరంగ సభ కావడం గమనార్హం

కూనంనేని సూపర్బ్ స్పీచ్ ….

సభకు అధ్యక్షత వహించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సభికులను ఆకట్టుకునేలా అద్భుత ప్రసంగం చేశారు .దేశ పరిస్థితులు , కమ్యూనిస్టుల విధానం , ఎర్రజెండా గొప్పతనం ,ప్రజా పోరాటాలు గురించి ఆయన వివరించిన తీరు ప్రజలను ఆలోచింప జేసింది. కమ్యూనిస్టుల పని అయిపోయిందని అనుకునే వారు కారుకూతలు కుసేవారికి అదిరిపోయే సమాధానం ఇచ్చారు . నీరు ,గాలి ,వెలుగు , సూర్యుడు ,చంద్రుడు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని సభికుల హర్షద్వానాల మధ్య ఉద్యగభరితమైన ప్రసంగం చేశారు . ఎర్రజెండాకు ఎదురు లేదని ,ఉద్యమాల వెలుగులో కార్మికుల రక్తం లో నుంచి పుట్టిన జెండా దీనికి ఎవరు అడ్డం వచ్చిన ఊరుకునేది లేదని స్పష్టం చేశారు . ఎర్రజెండా పేదలకు , కార్మికులు ,యువజనులు , విద్యార్థలు మహిళలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు .ఎందరో పార్టీలు మార్చిన తమ పార్టీలో ఉన్నవారు సిద్దాంతం కోసం ,ప్రజలసమస్యల పరిస్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు . కమ్యూనిస్టులు లేకుండా జరిగిన ఉద్యమాలు లేవని అందుకే కమ్యూనిస్టులు బలపడటం ప్రజల కోసమేనని అన్నారు . ముందుగా సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబీర్ పాషా నాయకులను వేదిపై ఆహ్వానించారు .

Related posts

చీమలపాడు వెళుతున్న కాంగ్రెస్ నేత రేణుక చౌదరిని అడ్డుకున్న పోలీసులు …కేసు నమోదు ….

Drukpadam

తుమ్మల సై అంటున్నారా …? సైలెంట్ అయ్యారా …??

Drukpadam

బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం.. కార్యాలయ తలుపులు పగులగొట్టి అరెస్ట్!

Drukpadam

Leave a Comment