వామ్మో.. కమలహాసన్ మొత్తం రెమ్యూనరేషన్ రూ.230 కోట్లా?
- ప్రాజెక్ట్-కేలో విలన్‌గా నటిస్తున్న కమలహాసన్
- కమల్ హోస్ట్‌గా ఆగస్టులో తమిళ బిగ్ బాస్ ప్రారంభం
- బిగ్‌బాస్ కోసం కమల్ ఏకంగా రూ.130 కోట్లు తీసుకున్నారన్న వార్త వైరల్
- ప్రాజెక్ట్-కేలో కమల్ రెమ్యూనరేషన్ రూ.100 కోట్లు అంటూ అభిమానుల్లో మరో చర్చ
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కేలో ప్రముఖ నటుడు కమలహాసన్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఇటీవలే ధ్రువీకరించారు. దీంతో, సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇదే సమయంలో కమల్ పారితోషికంపైనా చర్చ మొదలైంది. ఈ సినిమాకు కమల్ ఏకంగా రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడన్న వార్త చెక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే, కమల్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ షో ఏడవ సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. తాను హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు కమల్ ఇటీవలే ధ్రువీకరించారు. ‘‘నేను తమిళ బిగ్ బాస్‌లో పాల్గొంటున్నా. ప్రజలతో కమ్యూనికేట్ చేసేందుకు ఇది మంచి వేదిక’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆగస్టులో ఈ షో మొదలు కానుంది. అయితే, ఈ సీజన్‌కు కమల్ ఏకంగా రూ.130 కోట్లు తీసుకుంటున్నారన్న వార్త ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.