Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?: కేసీఆర్

 తెలంగాణ అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదు?: కేసీఆర్

  • తాను ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదన్న బీఆర్ఎస్ చీఫ్
  • మహారాష్ట్రలోని సర్కోలీలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగం
  • బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని వెల్లడి

కేవలం ఐదారు సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటిది అన్ని వనరులు పుష్కలంగా ఉన్న మహారాష్ట్ర మాత్రం అభివృద్ధిలో వెనుకబడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకుని ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు.

మంగళవారం మహారాష్ట్రలోని సర్కోలిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ అని ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికీ ఏ టీమ్ కాదు, బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. రైతులంతా బీఆర్ఎస్ తో ఉంటే మిగతా పార్టీలే మనకు బీ టీమ్ లుగా మారుతాయని చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని కేసీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలలో 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించిందని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన భాజాపా.. అందరికీ మీరు అవకాశం ఇచ్చారని చెప్పారు. రైతులకు మంచి చేయాలని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంటే వీళ్లలో ఎవరైనా చేయగలిగే వారని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేని వాళ్లకు అధికారం కట్టబెట్టొద్దని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే రైతుల పక్షాన నిలుస్తుందని, అభివృద్ధి చేసి చూపెడుతుందని పేర్కొన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ముందుకు వెళుతున్నామని కేసీఆర్ చెప్పారు.

 

కేసీఆర్ కు ఓడిపోతాననే భయం పట్టుకుంది: సంజయ్ రౌత్

Sanjay Raut comments on KCR

మహారాష్ట్రలో పాగా వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా కావాలంటే… ఇక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ పై శివసేన (ఉద్ధవ్ థాకరే) నేత సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఓడిపోతాననే భయం కేసీఆర్ కు పట్టుకుందని… అందుకే మహారాష్ట్రలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డ్రామాలు ఆపాలని… లేకపోతే తెలంగాణలో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి 12 నుంచి 13 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో మహాకూటమి బలంగా ఉందని అన్నారు.

Related posts

ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్‌పై వేటుకు అవే కారణాలా?

Drukpadam

మధిర భట్టి గెలుపులోఆమెదే కీలక పాత్ర…

Drukpadam

పీకే వ్యూహాలు ,కేసీఆర్ రాజకీయ చతురత ప్రత్యర్థులు తట్టుకోగలరా ?

Drukpadam

Leave a Comment