ప్రభుత్వ ఎస్సీ వ్యతిరేక చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారు: చంద్రబాబు…
-ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు సుధాకర్ బలి
-నడిరోడ్డుపై దుస్తులు తీసి వేధించింది
-ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలి
-చంద్రబాబు ప్రతిదాన్ని రాజకీయం చేయడం తగదంటున్న వైసీపీ
-వాస్తవాలను మాట్లాడి తనగౌరవాన్ని పెంచుకోవాలని సూచన
నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. జగన్ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక విధానాలకు సుధాకర్ బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్ష సాధింపు విధానాలకు ఆయన బలయ్యారని అన్నారు.
మాస్కులు లేవని ప్రశ్నించిన పాపానికి శారీరకంగా, మానసికంగా వేధించిన జగన్ ప్రభుత్వం ఆయనను హత్య చేసిందని, నడిరోడ్డుపై దుస్తులు తీసి వేధించిందన్నారు. ఆయన కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం హాస్పిటల్ లో అనస్తీసియా డాక్టర్ గా పని చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంపై విమర్శలు వచ్చాయి.ఆ తరువాత ఆయన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ప్రమేయంతోనే ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి విమర్శలు చేశారని అభియోగాలు ఉన్నాయి. తరువాత ట్రాఫిక్ కానిస్టేబల్ పై తిరగబడ్డారని కేసు నమోదు అయింది.ఆయన తనపై కావాలనే ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని హైకోర్టు ను ఆశ్రయించడం హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం తెలిసింది.సిబిఐ నివేదికపై ఇంకా తీర్పు వెలువడలేదు. ఆయన గుండెపోటుతో మరణించడం విషాదకరం . దీనిపై కూడా రాజకీయాలు చేయడంపై దురదృష్టకరం అని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు ప్రతిదాన్ని రాజకీయం చేయడమానీ వాస్తవాలను మాట్లాడాలి తన గౌరవాన్ని పెంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.