Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సైనిక ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్న రఘురామ కృష్ణరాజు…

సైనిక ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్న రఘురామ కృష్ణరాజు…
-రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామ రాజు
-నిన్ననే మంజూరైన బెయిలు
-విధివిధానాల పూర్తికి సమయం పట్టడంతో రాత్రంతా ఆసుపత్రిలోనే
బెయిలు మంజూరు కావడంతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు విడుదల కానున్నారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామ ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ధర్మాసనం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసేందుకు సమయం పట్టడంతో రాత్రి ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. మరికాసేపట్లో ఆయన విడుదల కానున్నారు. విడుదలైన వెంటనే ఆయన హైద్రాబాద్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఆయన ఎక్కడ పత్రిక ప్రకటనలు చేయడంకాని , మీడియా తో మాట్లాడటం కానీ చేయకూడదనే షరతు ఉంది . అందువల్ల ఆయన ఇంటి వద్దనే ఉండే ఆవకాశముంది. అంటే కాకుండా ఎ సి బి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు 24 గంటల నోటీసుతో వెళ్ళలిసిఉంది.

Related posts

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కు ప్రధాని మోదీ కాంప్లిమెంట్స్ !

Drukpadam

ప్రజారవాణాకు ఆటంకం కలిగిస్తే ఉక్కుపాదం…మంత్రి పువ్వాడ హెచ్చరిక!

Drukpadam

నా సతీమణి మేయర్ బరిలో లేరు …మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టీకరణ

Drukpadam

Leave a Comment