‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి
-
జితేందర్‌రెడ్డి ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందించిన రేవంత్
- బీజేపీ అంతర్గత తన్నులాటను అద్భుతమైన పోలికతో వివరించారని ఎద్దేవా
- ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి ఇదేనని వ్యాఖ్య
తెలంగాణా బీజేపీలో అంతర్గత పోరు రెచ్చకెక్కింది . ఆపార్టీలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నిలకల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీని కలవరపాటుకు గురిచేస్తుంది. ఈటెల , బండి సంజయ్ మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ పార్టీ ప్రక్షాళన దిశగా ఆలోచనలు చేసింది. ఢిల్లీ పెద్దలకు ఒక్కరిపై ఒకరు ఫిర్యాదులు , పార్టీకి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి …దీంతో రాష్ట్ర అధ్యక్షుడు మార్పు దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే దాన్ని బీజేపీ ఖండినచినప్పటికీ ఇంకా పరిస్థితులు చక్కబడలేదు . అందువల్ల పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అందులో రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు బీజేపీలో తీసుకోని రావాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించించారు . తెలంగాణాలో అధ్యక్షుని మార్పు ఉంటుందనే దిశగా ఆలోచనలు చేసినట్లు తెలుస్తుంది .బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించి ,కేంద్రమంత్రిగా బండి సంజయ్ ని చేయాలనీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈటెలను ప్రచారం కమిటీ చైర్మన్ భాద్యతలు అప్పగిస్తారని ,లేదా ఆయన్నే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు చేస్తారని కూడా మరో ప్రచారం ఉంది. …
వివాదాస్పదమైన జితేందర్‌రెడ్డి ట్వీట్….
తెలంగాణ బీజేపీపై ఆ పార్టీ నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన.. ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు. అది కాస్తా వివాదాస్పదం కావడంతో వివరణ ఇస్తూ ఆయన మరో ట్వీట్ కూడా చేశారు.
వివాదాస్పద ట్వీట్‌పై వివరణ ఇచ్చిన జితేందర్‌రెడ్డి