కేసీఆర్ తంత్రం :హుజురాబాద్ పై నజర్…
-హరీష్ రావు ఆపరేషన్ స్టార్ట్ …స్థానిక నేతలతో సమావేశాలు
-ఇక హుజురాబాద్ భారం హరీశ్ రావుపైనే
-టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్
-కేసీఆర్ సూచనలతో రంగంలోకి దిగిన హరీశ్
-హుజూరాబాద్ నియోజకవర్గ నేతలతో భేటీ
మాజీమంత్రి ,ఇటీవలనే భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గంనుంచి భర్తరఫ్ కు గురైన ఈటలను కేసీఆర్ టార్గెట్ చేశారు. అందులో భాగంగానే ఈటల స్వంత నియోజకవర్గమైన హుజురాబాద్ లో రాజకీయతంత్రాన్ని రచిస్తున్నారు. నియోజకవర్గం పైన సీరియస్ గా ఫోకస్ పెట్టారు.అందుకనుగుణంగా వ్యూహరచన చేస్తున్న కేసీఆర్ ట్రబుల్ షూటర్ గా పేరున్న సీనియర్ మంత్రి స్వయాన తన మేనల్లుడు తన్నీరు హరీష్ రావు ను రంగంలోకి దించారు. రంగంలోకి దిగిన ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ నేతలతో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈటల కు హరీష్ రావు కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే పేరుంది. ఈటల ,హరీష్ మంచి స్నేహితులుగా కూడా గుర్తింపు పొందారు. ఒక రకంగా చెప్పాలంటే ఈటల కూడా హరీష్ రావు కు బాగా దగ్గరగా ఉండేవారని పేరుంది. టీఆర్ యస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ తరువాత ప్రజల్లో వీరికే మంచి పేరుంది. అందుకే ప్రత్యేకించి ఇక్కడ ఆపరేషన్ భాద్యతలను హరీష్ రావు కు అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు. ఈటల భూకబ్జా ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి తొలగించిన తరువాత టీఆర్ యస్ పార్టీ శ్రేణుల్లోనూ , బయట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుంది. వివిధ రాజకీయపార్టీలు సామాజిక ఉద్యమకారులు , ప్రజాసంఘాలు ,ఈటలపై చర్యలను వ్యతిరేకిస్తున్నారు.ఇది ఈటలకు జరిగిన అన్యాయంగా భావిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతికదలికలో ఈటలపైనే కేంద్రీకృతం అయింది . నిన్నగాక మొన్న కరోనా భాదితుల పరామర్శ కోసం వరంగల్ పర్యటనలోను పనిలో పనిగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లి హుజురాబాద్ పై వాకబు చేసినట్లు సమాచారం .ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కూడా ప్రస్తావించి బాగా మాట్లారని ప్రశంసించినట్లు తెలిసింది. కెప్టెన్ లక్ష్మీకాంతరావు మనవడు ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలుస్తుంది.కెప్టెన్ లక్ష్మీకాంతరావు మనవడు పేరుకూడా ఉపఎన్నికలు జరిగితే పరిశీలనలో ఉండటంతో కేసీఆర్ ,కెప్టెన్ లమధ్య కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పటికే ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్… ఆయన రాజకీయ పునాదులను కూడా కదిలించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. నిన్నటి వరకు ఈటలను టర్గెట్ చేసే పనిని మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించారు. అయితే, ఆశించిన మేరకు గంగుల తన బాధ్యతలను నిర్వహించలేకపోయారు. గంగులను టార్గెట్ చేస్తూ ఈటల తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో… కేసీఆర్ గంగుల వల్ల ఆశించిన ఫలితం రాకపోవచ్చునని భావిస్తున్నారు.తన మేనల్లుడు, టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్ రావును హుజూరాబాద్ లో రంగంలోకి దించారు. కేసీఆర్ సూచనలతో హరీశ్ రంగంలోకి దిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పలువురు టీఆర్ఎస్ నేతలను గెలిపించిన సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ హరీశ్ కు ఉంది. ఈ నేపథ్యంలో, ఈటలను దెబ్బతీసేందుకు హరీశ్ ను రంగంలోకి దించడం ఆసక్తికరంగా మారింది. అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టల చందంగా హరీష్ రావు ను ప్రయోగించటం ద్వారా ఈటల రాజేందర్ , హరీష్ మధ్య ఉన్న స్నేహ సంబంధాలను సైతం దెబ్బతీయడంతో పాటు వారిమధ్య దూరం పెంచవచ్చుననే రాజనీతిని రాజకీయ చాణిక్యుడుగా పేరొందిన కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోజురోజుకు హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏమి జరుగుతుందో చూడాలి మరి !