హరీశ్, ఈటల మధ్య చిచ్చు పెడుతున్న కేసీఆర్ : ముదిరాజ్ నేత ధ్వజం…
-ఇంతకాలం కేసీఆర్ కు కుడి, ఎడమ భుజాలుగా హరీశ్ రావు, ఈటల ఉన్నారు
-టీఆర్ఎస్ లో హరీశ్ కూడా అన్యాయానికి గురవుతున్నారు
-ఈటల వెనుక వేలాది మంది ట్రబుల్ షూటర్లు ఉన్నారు
ఉద్యమకాలంలోనూ ఆతరువాత మంచి స్నేహితులుగా ఉన్న హరీష్ రావు , ఈటల రాజేందర్ మధ్య కేసీఆర్ చిచ్చుపెడుతున్నారని ముదిరాజ్ మహాసభ హుజురాబాద్ ఇంచార్జి కుమారస్వామి ధ్వజమెత్తారు. హరీష్ రావు కూడా ఇది తెలుసుకొని మసులుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఈటల మీద ద్వేషం పెంచుకొని భూకబ్జా నేరం అంటగట్టి బయటకు పంపారని ఇది తెరాస లో ఉన్న నాయకులకు కూడా తెలుసునని అన్నారు. హరీష్ రావు ను హుజురాబాద్ ఇంఛార్జిగా పంపడంలో కేసీఆర్ ఉద్దేశం ఏమిటో తెలియనంత అమాయకులు కాదు ప్రజలను అన్నారు. ఇంతకాలం కేసీఆర్ కు కుడి, ఎడమ భుజాలుగా హరీశ్ రావు, ఈటల రాజేందర్ ఉన్నారని… ఇప్పుడు వారిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది హరీష్ రావు కూడా తెలుసునని పేర్కొన్నారు. హరీష్ రావుకు పార్టీలో జరిగిన న్యాయమేమిటి ,
వాస్తవానికి టీఆర్ఎస్ లో హరీశ్ రావు కూడా అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఈటలకు చెక్ పెట్టేందుకు హరీశ్ ను కేసీఆర్ రంగంలోకి దించారని… ఇది చాలా దారుణమని అన్నారు. కేసీఆర్ కు హరీశ్ రావు ఒక్కరే ట్రబుల్ షూటర్ అని… కానీ, ఈటల వెనుక వేలాది మంది ట్రబుల్ షూటర్లు ఉన్నారని చెప్పారు.
next post