Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మద్దతు… బీఆర్ఎస్ నేతలపై ఫైర్

  • రేవంత్ రెడ్డి కాంగ్రెస్’ కాదు… ‘చంద్రబాబు కాంగ్రెస్’ అంటూ కేటీఆర్ వ్యంగ్యం
  • బీఆర్ఎస్ నేతల మూలాలు ఎక్కడున్నాయన్న జీవన్ రెడ్డి
  • బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు వారసత్వ పార్టీ అంటూ ఎద్దేవా
  • చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష అని వెల్లడి

ఉచిత విద్యుత్ అంశంలో బీఆర్ఎస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడుతున్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డికి వాస్తవాలు వక్రీకరించడం తెలియదని స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతోంది మంత్రి కేటీఆరేనని ఆరోపించారు. 

ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదని, చంద్రబాబు కాంగ్రెస్ అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించడం పట్ల జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అసలు, బీఆర్ఎస్ పార్టీనే చంద్రబాబు వారసత్వ పార్టీ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎక్కడ్నించి వచ్చారు… టీడీపీ నుంచి కాదా? అసలు… సీఎం కేసీఆర్ మూలాలు ఎక్కడున్నాయి… టీడీపీలో కాదా? అంటూ నిలదీశారు. 

బీఆర్ఎస్ మంత్రివర్గం పుట్టిందే టీడీపీలో అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ క్యాబినెట్లో 16 మంది మంత్రులు టీడీపీ నుంచే వచ్చారని అన్నారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే ఇవాళ బీఆర్ఎస్ నేతలకు రాజకీయ భిక్ష అని వివరించారు. పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని, ఎర్రబెల్లి… వీళ్లందరూ చంద్రబాబు పంచన లేరా? మంత్రి పదవి ఇవ్వలేదనే కదా కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టింది అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. 

ఇవాళ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ పై చర్చ లేవనెత్తినందువల్లే రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఇప్పుడు 24 గంటల విద్యుత్ వస్తోందంటే అది కాంగ్రెస్ పార్టీ చలవేనని అన్నారు.

Related posts

పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరంలేదన్న ఏపీ హైకోర్టు… పిటిషన్ డిస్మిస్!

Ram Narayana

సంక్షోభంలో గో ఫస్ట్ ఎయిర్ లైన్స్.. టికెట్ తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?

Drukpadam

ఒక ప్రపంచం.. ఒకే ఆరోగ్యం’ విధానాన్ని అమలు చేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ…

Drukpadam

Leave a Comment