Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ ,టీడీపీ మధ్య పవన్ మధ్యవర్తిత్వం …సిపిఐ నారాయణ గుస్సా …!

టీడీపీ, బీజేపీ మధ్య పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు: సీపీఐ నారాయణ

  • ఎన్డీయేతో పవన్ చేతులు కలపడంపై నారాయణ విమర్శలు
  • చేగువేరా నుంచి సావర్కర్ వైపు ప్రయాణం చేస్తున్నారని విమర్శలు
  • మితవాదం వైపు పవన్ ప్రయాణిస్తున్నారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ,టీడీపీ మధ్య సయోధ్య కుదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుస్సా అయ్యారు . ఒక పక్క చేగువేరా అంటూ …మరో పక్క సావర్కర్ కు జై కొట్టడాన్ని ఆయన తప్పు పట్టారు . ఇవిమీ రాజకీయాలు నేను అభ్యుదయ వాడిని చేగువేరా నాకు ఆదర్శం అంటూ చెప్పి తిరిగిన పవన్ కళ్యాణ్ సావర్కర్ ఇప్పుడు తిరోగమన విధానాల వైపు వెళ్లడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు . ఆయన వెళ్లడమే కాకుండా టీడీపీని కూడా రావాలని కోరడం అత్యంత జుగుస్సాకరమని పేర్కొన్నారు .

ఎన్డీయేతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లడం బాధను కలిగిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చేగువేరా నుంచి సావర్కర్ వైపు పవన్ కల్యాణ్ ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు. అతివాద పోరాట యోధుడు చేగువేరా నుంచి మితవాది అయిన సావర్కర్ వైపు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు బీజేపీ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, టీడీపీ మధ్య పవన్ మధ్యవర్తిత్వం చేయడం కూడా మంచిది కాదని అన్నారు. పవన్ ఇప్పటి వరకు చేసిన రాజకీయాలకు, ఇప్పుడు చేస్తున్న రాజకీయాలకు తేడా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పచ్చి మితవాదం వైపు పవన్ ప్రయాణిస్తుండటం దురదృష్టకరమని అన్నారు.

Related posts

బీజేపీ అసంతృప్త నేతలపై అధిష్ఠానం సీరియస్!

Drukpadam

అమిత్ షాకు మాయావతి కౌంటర్…

Drukpadam

ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విశ్వసనీయత లేదు: జీవీఎల్

Drukpadam

Leave a Comment