బెంగాల్‌లో శాసన మండలి ఏర్పాటుకు మమతా సర్కార్ ప్రయత్నాలు…
-తమిళనాడు కూడా మండలి ఏర్పాటుకు డీఎంకే హామీ
-రాష్ట్రాలు మండలి ఏర్పాటు కోసం శాసనసభలో తీర్మానం చేయవచ్చు
–శాసనసభలో తీర్మానం ద్వారా శాసనమండలిని రద్దు చేయడం లేదా ఏర్పాటు కుదరదు.
-పార్లమెంట్ లోని ఉభయసభలు దాన్ని ఆమోదించాలి
-ఇప్పటికే అసోం ,రాజస్థాన్ మండలి ఏర్పాటు కోసం పంపిన బిల్లులు పెండింగ్ ఉన్నాయి.
-ఆంధ్రప్రదేశ్ మండలి రద్దు బిల్లు ఇంకా పార్లమెంట్ ముఖం కూడా చూడలేదు
రాష్ట్రాలలో శాసన మండళ్ల ఏర్పాటు , లేదా రద్దు అంశం మరో సారి చర్చనీయాంశం అయింది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సర్కార్ ,తమిళనాడు లో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సర్కార్ తమతమ రాష్ట్రాలలో విధాన పరిషత్ ఏర్పాటుకు హామీ ఇచ్చాయి . మమతా సర్కార్ కు మండలి ఉంటె ఓడిపోయి ముఖ్యమంత్రి భాద్యతలు స్వీకరించిన మమతా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకుండా మండలి ద్వారా ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుందని భావించవచ్చు అందువల్ల మండలి చర్చనీయాంశం అయింది. తమిళనాడు లో కూడా మండలి ఏర్పాటుకు గత కొన్ని సంవత్సరాలుగా డీఎంకే ప్రయత్నం చేస్తూనేఉంది . మొన్నటి ఎన్నికలల్లో కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ తాము అధికారంలోకి వస్తే మండలి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు రాష్ట్రాలు హామీ లైతే ఇచ్చాయి . శాసనసభలో మెజార్టీ ఉంది గనుక తీర్మానాలు కూడా చేస్తాయి . ఇంతవరకు బాగానే ఉన్నా పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందటం అనేది అంత తేలిక కాదు . ఎందుకంటే ఇప్పటికే అసోం లో మండలి ఏర్పాటుకోసం 2010 లో రాజస్థాన్ ప్రభుత్వం 2012 లో మండలి ఏర్పాటు కోసం తీర్మానాలు చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపాయి. నాటినుంచి నేటి వరకు ఆబిల్లు లు ఆమోదం పొందలేదు . బెంగాల్, తమిళనాడు లలో ఇంకా శాసనసభ లలో తీర్మానాలు చేయలేదు. అందువల్ల ఈ రెండు రాష్ట్రాలు పైగా కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీకి బద్ద వ్యతిరేయకమైన పార్టీలు అందువల్ల ఇప్పటిలో అయ్యే అవకాశమే లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మండలి రద్దు చేయాలనీ తీర్మానం చేసి కండరానికి పంపింది . అది ఇంకా హోమ్ శాఖ న్యాయశాఖల మధ్యనే తిరుగుతుంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నరాష్ట్రాలు పార్లమెంట్ ఆమోదం కోసం ఏదైనా బిల్లులు పంపితే అంత తేలికగా బిల్లు అవ్వడం దుర్లభ అంటున్నారు. పరిశీలకులు .
పశ్చిమ బెంగాల్‌లో ఎగువ సభ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇటీవల ముగిసిన శాసన సభ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది. ప్రస్తుతం బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక.. మొత్తం ఆరు రాష్ట్రాల్లోనే శాసనమండలి లేదా ఎగువ సభ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో శాసనమండలిని 50 సంవత్సరాల క్రితం, అప్పటి వామపక్ష పార్టీల సంకీర్ణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇన్నేళ్ల తరువాత రాష్ట్రంలో మండలి ఏర్పాటుపై మమత పట్టుబడుతోంది. అయితే ఎగువ సభ ఏర్పాటు రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య మరో యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంది.
రాష్ట్రాలలో ఎగువ సభ అనవసరమని బిహార్‌కు చెందిన ప్రొఫెసర్ కేటీ షా అప్పట్లో వాదించారు. మండలి సభ్యుల జీత భత్యాల ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడుతుందని చెప్పారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు శాసనం ద్వారా చేసే చట్టాలను.. పార్టీల ప్రతినిధులు మాత్రమే ఉండే ఎగువ సభ అడ్డుకునే అవకాశం సైతం ఉందని షా తెలిపారు. దీంతో అప్పట్లో బిహార్, బొంబాయి, మద్రాస్, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలిని రాజ్యాంగ రూపకర్తలు ఏర్పాటు చేశారు. రాష్ట్రాల శాసనసభలో తీర్మానం ద్వారా కొత్త మండలిని ఏర్పాటు చేయడం.. లేదా ఇప్పటికే ఉన్న మండలిని రద్దు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఒక చట్టంపై రెండు సభల మధ్య విభేదాలు ఏర్పడితే, కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం శాసనసభలకు ఇచ్చింది. మండలి సభ్యుల సంఖ్యను సైతం రాజ్యాంగం పరిమితం చేసింది. శాసన సభలకు ఎన్నికైన సభ్యుల్లో మూడింట ఒక వంతు మంది మాత్రమే కౌన్సిల్‌లో ఉండాలని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం.. ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా శాసనమండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. లేదంటే అప్పటికే ఉన్న మండలిని రద్దు చేయవచ్చు. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని 1969 మార్చిలో ఆమోదించింది. నాలుగు నెలల తరువాత, పార్లమెంటు ఉభయ సభలు ఈ చట్టాన్ని ఆమోదించాయి. పంజాబ్ కూడా అదే సంవత్సరం రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసింది. శాసనమండలి అనేది కాలక్రమంలో ఒక రాజకీయ అంశంగా మారింది. పార్టీలు, ప్రభుత్వాలు దీన్ని రాజకీయ సమస్యగానే చూస్తున్నాయి. తమిళనాడులో కౌన్సిల్ ఏర్పాటు అంశం 30 ఏళ్లుగా వివాదాస్పంగా ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వం 1986లో శాసన మండలిని రద్దు చేసింది. అప్పటి నుంచి కౌన్సిల్‌ను తిరిగి ఏర్పాటు చేయడానికి డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ చర్యలను అన్నా డీఎంకే వ్యతిరేకిస్తోంది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో సైతం, రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేస్తామని DMK మ్యానిఫెస్టోలో పేర్కొంది. 2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సైతం ఇలాంటి హామీ ఇచ్చింది.
ఏపీలో మండలి రద్దుకు సిఫార్స్
అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో శాసన మండలి కావాలని అందుకు పార్లమెంట్ ఆమోదంకోసం రాష్ట్ర అసెంబ్లీ లలో తీర్మానాలు చేసి పంపుతుంటే , ఏపీ లో మాత్రం అందుకు భిన్నంగా మండలి రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది .
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని 1958లో మొదటిసారి స్థాపించారు. ఆ తరువాత 1985లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ఎగువ సభను రద్దు చేసింది. 2007లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మండలిని తిరిగి ఏర్పాటు చేసింది. గత సంవత్సరం టీడీపీ ఆధిపత్యం ఉన్న ఏపీ శాసనమండలి, ప్రభుత్వం రూపొందించిన మూడు క్యాపిటల్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సైతం శాసన సభ ఆమోదించింది.
శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించినంత మాత్రాన శాసనమండలిని రద్దు చేయడం లేదా స్థాపించడం కుదరదు. వీటికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించాలి. 2010లో అస్సాం అసెంబ్లీ, 2012లో రాజస్థాన్ అసెంబ్లీ సైతం తమ రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు చేయాలనే తీర్మానాలను ఆమోదించాయి. కానీ ఈ రెండు బిల్లులు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు..