కరోనాతో ఆసుపత్రిపాలైన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య
- ఈ నెల 18నే భట్టాచార్యకు కరోనా పాజిటివ్
- తొలుత ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరణ
- ఆక్సిజన్ స్థాయులు 90 కంటే దిగువకు
- కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తరలింపు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (77) కరోనా సోకడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ నెల 18నే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చేరేందుకు భట్టాచార్య అంగీకరించలేదు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయన ఆక్సిజన్ స్థాయులు 90 శాతం కంటే దిగువకు పడిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. బుద్ధదేవ్ భట్టాచార్య ఇప్పటికే క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ)తో బాధపడుతున్నారు.
కాగా, భట్టాచార్య అర్ధాంగి మీరా కూడా కరోనా బారినపడ్డారు. ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం నిన్ననే డిశ్చార్జి అయ్యారు.