Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ యంత్రం కూలి 14 మంది మృతి

  • థానే జిల్లా షాపూర్‌లో ఘటన
  • సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులు, బ్రిడ్జి నిర్మిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం
  • పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం కార్మికులపై పడటంతో ఘోర ప్రమాదం
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

మహారాష్ట్రంలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. థానే జిల్లా షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కార్మికులపై పడింది. 

పిల్లర్లతో అనుసంధానించే ఈ యంత్రం వంద అడుగుల ఎత్తు నుంచి పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts

జకార్తా జైలులో ఘోర అగ్నిప్రమాదం… 41 మంది ఖైదీల సజీవదహనం!

Drukpadam

అమెరికాలో భర్త వేధింపులకు తట్టుకోలేక హైద్రాబాద్ చేరుకున్న యువతి …పోలీసులకు ఫిర్యాదు

Drukpadam

కారుపై పొరపాటున పడిన ఉమ్ము.. బెల్టుతో చితకబాది వీరంగం!

Drukpadam

Leave a Comment