మోడర్న పిల్లలకు తిరుగులేని వ్యాక్సిన్…
బాలలపై 100 శాతం సమర్థతతో పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్!
12 నుంచి 17 ఏళ్ల బాలలపై అధ్యయనం
సానుకూల ఫలితాలు వచ్చాయన్న మోడెర్నా
జూన్ లో ఎఫ్ డీఏకు దరఖాస్తు
అనుమతులు విస్తరించాలని కోరనున్న మోడెర్నా
కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీల్లో మోడెర్నా కూడా ఒకటి. తాము రూపొందించిన వ్యాక్సిన్ బాలలపైనా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా చెబుతోంది. 12 నుంచి 17 ఏళ్ల బాలలపై తమ కొవిడ్ టీకాను ప్రయోగించి చూడగా, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని మోడెర్నా వివరించింది. ఈ క్రమంలో జూన్ ఆరంభంలో ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులు కోరేందుకు సన్నద్ధమవుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ ప్రాచుర్యం ఉన్న కరోనా వ్యాక్సిన్ టీకాలలో మోడర్న ఒకటి . ఇప్పటికే అనేక దేశాలకు ఈ వ్యాక్సిన్ సరఫరా చేశారు. ఇంకా అనేక దేశాలు మోడర్న కోసం క్యూలో ఉన్నాయి. మనదేశం నుంచి కూడా మోడర్న కోసం టెండర్లు దాఖలు చేసినప్పటికీ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన దేశాలు ముందు వరసలో ఉన్నందున 2023 వరకు సాధ్యం కాదని తేల్చి చెప్పాయి.
మోడెర్నా వ్యాక్సిన్ కు ఇప్పటికే అమెరికాలో ఎఫ్ డీఏ అనుమతులు ఉండగా, వ్యాక్సిన్ ను చిన్నారులకు కూడా ఉపయోగించేందుకు అనుమతిని విస్తరింపజేయాలని కోరనుంది. ఎఫ్ డీఏ అనుమతులు వస్తే, టీకా ఉత్పత్తిని మరింత పెంచనుంది. మోడెర్నా తన టీకాలను ఎం-ఆర్ఎన్ఏ 1273 సాంకేతిక విధానంతో అభివృద్ధి చేసింది. మోడెర్నా కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్. దీన్ని ఇప్పటికే అమెరికాలో పెద్దవాళ్లకు ఇస్తున్నారు.