Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చిన్నారిపై నుంచి వెళ్లిన స్కూల్ బస్.. హైదరాబాద్ లో ఘోరం

  • పాపను స్కూలుకు తీసుకెళుతున్న తండ్రి
  • బాచుపల్లిలో రోడ్ పై గుంతలు.. ఎగిరి కిందపడ్డ బాలిక
  • స్కూల్ బస్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవలి వర్షాలకు రోడ్డుపై ఏర్పడిన గుంతలు ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తండ్రితో కలిసి బైక్ పై స్కూలుకు వెళుతున్న రెండో తరగతి చిన్నారి ఈ ప్రమాదంలో మృత్యువాత పడింది.

ఈ దారుణం నగరంలోని బాచుపల్లిలో జరిగింది. రోజులాగే ఆ పాప తండ్రి బైక్ పై కూతురును స్కూలుకు తీసుకెళుతున్నాడు. ఇటీవలి వర్షాలకు రోడ్డంతా గుంతలమయం కావడంతో జాగ్రత్తగా వెళుతున్నాడు. రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో బైక్ ఓ గుంతలో నుంచి వెళ్లడంతో పాప ఎగిరి కిందపడింది. బైక్ వెనకాలే వస్తున్న స్కూల్ బస్సు ఒకటి పాప పై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

తీహార్ జైలు నుంచి సీక్రెట్ ఆఫీస్ నడుపుతున్న యూనిటెక్ వ్యవస్థాపకులు!

Drukpadam

మరో 232 యాప్‌లను నిషేధించనున్న కేంద్రం.. చైనా లింకులే కారణం..

Drukpadam

మరియమ్మది ముమ్మటికి రాష్ట్రప్రభుత్వ హత్యే :సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment