-ల్యాంప్ కొందామని వెళ్లి.. తెగ షాపింగ్ చేసిన యువతి.. అర చేతిలో ఆరు అడుగుల రశీదు!
-ఒక్కటే ల్యాంప్ కోసం వెళ్లి.. రెచ్చిపోయి మరీ షాపింగ్
-భారీ కొనుగోళ్లతో మనిషి పొడవు రశీదు
-ట్విట్టర్ లో షేర్ చేసిన హైదరాబాద్ మహిళ
హైదరాబాదీ మహిళ ఒకరికి ఊహించని అనుభవం ఎదురైంది. ఒక్క ల్యాంప్ కోసం ఐకియా స్టోర్ కు వెళ్లగా.. చివరికి ఆమె ఆరు అడుగుల పొడవు మేర బిల్లు వచ్చేంతగా షాపింగ్ చేసేసింది. సాధారణంగా భారీ సంఖ్యలో వస్తువులను కొనుగోలు చేసినప్పుడు అంత పొడవైన రశీదు వస్తుంటుంది. నిజానికి హైదరాబాద్ కు చెందిన సమీర షాపింగ్ లిస్ట్ అంత లేదు. ఒకటే ల్యాంప్ కోసం వెళ్లింది. కానీ, ఐకియా స్టోర్ నమూనా ఫలితంగా ఆమె అసలు కావాల్సింది మర్చిపోయి, రెచ్చిపోయి మరీ షాపింగ్ చేసేశారు.