Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

నెగ్గిన పట్నం పంతం …మంత్రిగా ప్రమాణస్వీకారం …

నెగ్గిన పట్నం పంతం …మంత్రిగా ప్రమాణస్వీకారం …
ఎన్నికల వేళ మంత్రిగా చేరడంపై చర్చ
కాంగ్రెస్ లోకి వెళతాడని ప్రచారం నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకున్న కేసీఆర్

తెలంగాణ కేబినెట్‌ విస్తరణ … మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం..
సీఎం కేసీఆర్ మంత్రులు ,హాజరు

రాజ్‌భవన్‌ లో గవర్నర్ తమిళిసై మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ పలువురు మంత్రులు హజరయ్యారు. మొత్తానికి పట్నం మహేందర్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.

ఈటల రాజేందర్ బర్త్‌రఫ్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు సీఎం కేసీఆర్ ఆ మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు.

తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని అంతా భావించినా.. సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు లీకులు కూడా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది…

Related posts

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై కేసీ వేణుగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana

దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

Ram Narayana

Leave a Comment