Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్!

  • ప్రభుత్వ తప్పుల గురించి మాట్లాడేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు
  • రఘురాజును పోలీసులు హింసించారు
  • సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వం అడ్డంగా బుక్కయింది

తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా మహానాడు వర్చువల్ మాధ్యమంగానే జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించి మహానాడును ప్రారంభించారు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. ఆయన దారిలోనే ఆత్మగౌరవంతో పాటు, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తాను సంకల్పించానని తెలిపారు. ఈరోజు తెలుగు జాతికి పండుగరోజు అని చెప్పారు. టీడీపీ అన్ని కులాలు, మతాల ప్రజలకు చెందినదని అన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తప్పులపై మాట్లాడుతున్న వారిని అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడేవారి నోళ్లను మూయించేలా స్టేట్ టెర్రరిజంకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చివరకు కోర్టులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారంటే… రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు పోతోందో అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు.

అచ్చెన్నాయుడుతో మొదలు పెట్టిన అక్రమ కేసుల పర్వాన్ని జనార్దన్ రెడ్డి వరకు కొనసాగించారని చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై అక్రమ కేసులు పెట్టి… పోలీసు కస్టడీలో శారీరకంగా హింసించారని మండిపడ్డారు. రఘురాజు విషయంలో స్థానికంగా అంతా మేనేజ్ చేసిన వైసీపీ ప్రభుత్వం… సుప్రీంకోర్టులో మాత్రం అడ్డంగా బుక్కయిందని ఎద్దేవా చేశారు

Related posts

ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్ : సీఎం జగన్ ప్రకటన!

Drukpadam

వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు.. నలుగురి పేర్లను పేర్కొన్న సీబీఐ!

Drukpadam

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత!

Drukpadam

Leave a Comment