Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంతకీ ఈటల బీజేపీలో చేరుతున్నట్లా? లేదా ?

ఇంతకీ ఈటల బీజేపీలో చేరుతున్నట్లా? లేదా ?
బీజేపీలో ఈటల చేరుతున్నట్లు లీకులు
తెలంగాణ బీజేపీ కీలక నేతలతో జేపీ నడ్డా వర్చువల్ సమావేశం
బీజేపీలో ఈటల చేరికపైనే ప్రధాన చర్చ
ఈటల చేరికకు పచ్చ జెండా ఊపిన నడ్డా
ఇంతకీ ఈటల రెజేందర్ దారెటు అనేది తెలంగాణాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.అందుకు కారణంలేక పోలేదు. ఆయన అన్ని పార్టీల వాళ్ళను, తన హితులు సన్నిహితులను కలుస్తున్నారు. బీజేపీ వాళ్లతో ఎక్కువసార్లు సమావేశం అయ్యారు .దీనిపై రరకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీజేపీ లో చేరుతున్నట్లు అందుకు బీజేపీ అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ లో చేరాలని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు ఈటలపై వత్తిడి తెస్తున్నారు.ఆయన మాత్రం కొండవిశ్వేశ్వరరెడ్డి , ప్రొఫెసర్ కోదండరాం తో కూడా సమావేశం అయ్యారు. ఆయనే స్వయంగా బీజేపీ లో చేరటంలేదని ఒక టీవీ ఛానల్ ఇంటర్వూ లో చెప్పారు . మరి బీజేపీ మాత్రం తమ పార్టీలో చేరబోతున్నారంటూ అందుకు అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు చెబుతుంది …..
గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలతో ఆయన వరుస సమావేశాలను నిర్వహించడంతో… ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై సంధిగ్దత నెలకొంది. ఆయన ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఆయనతో చర్చించడంతో నిన్న రాత్రికి కొంత క్లారిటీ వచ్చింది. తాజగా, ఆయన బీజేపీలో చేరబోతున్నరనే విషయం కన్ఫామ్ అయింది. తమ పార్టీలో ఈటల చేరేందుకు బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర కీలక నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు వర్చువల్ గా సమావేశమయ్యారు. బీజేపీలో ఈటల చేరికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో ఈటల చేరికకు నడ్డా పచ్చ జెండా ఊపారు. బీజేపీలో ఈటల ఎప్పుడు చేరాలనే విషయాన్న ఆ పార్టీ రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్టు సమాచారం.

తేదీని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన వెంటనే ఢిల్లీకి ఈటల పయనమవనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

Related posts

పద్మభూషణ్ పురస్కారం నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య!

Drukpadam

ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం …ఎవరడ్డుకుంటారో చూస్తా …కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ …

Drukpadam

పీసీబీ ఆరోపణలపై మేం మాట్లాడదలుచుకోలేదు: గల్లా జయదేవ్!

Drukpadam

Leave a Comment