Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

I.N.D.I.A. కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదు: రాహుల్ గాంధీ

  • బీజేపీ అంచనాలు తారుమారు చేశామన్న రాహుల్ గాంధీ
  • బీజేపీ ఓటమికి బలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడి
  • అందరి నుండి తీసుకొని కొందరికే మోదీ మేలు చేస్తున్నారని విమర్శ
We will expedite all seat sharing decisions says Rahul Gandhi

I.N.D.I.A. కూటమి ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శలు చేస్తోందని, కానీ వారి అంచనాలు తారుమారు చేస్తూ తమలో ఏకాభిప్రాయం కుదరిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ… బీజేపీ ఓటమికి తాము బలమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. దేశంలోని అందరి నుండి దోచుకొని, కొంతమందికి మేలు చేసేందుకే మోదీ సర్కార్ కృషి చేస్తోందని దుయ్యబట్టారు. తమ కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదన్నారు.

తమ కూటమి 60 శాతం భారతీయులకు ప్రతీక అన్నారు. సీట్ షేరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. తామంతా ఒక్కటైతే కనుక బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను గెలవలేదన్నారు. తాము అభివృద్ధి ప్రాతిపదికన ముందుకు సాగుతామన్నారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, ఇది లడఖ్‌లో ప్రతి వ్యక్తికి తెలుసునని చెప్పారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు.

సీట్ల సర్దుబాటుపై 13 మందితో I.N.D.I.A. కూటమి కోఆర్డినేషన్ కమిటి.. సభ్యుల వివరాలు ఇవిగో!

  • సెప్టెంబర్ 30లోపు సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనున్న కోఆర్డినేషన్ కమిటీ
  • సభ్యుల్లో వేణుగోపాల్, పవార్, స్టాలిన్, రౌత్, తేజస్వి సహా వివిధ పార్టీల నేతలు
  • లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానం

ప్రతిపక్షాల I.N.D.I.A. కూటమి నేటి సమావేశంలో 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సెప్టెంబర్ 30లోపు సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.  కోఆర్డినేషన్ ప్యానెల్ సభ్యులుగా కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆమ్ ఆద్మీ పార్టీ), జావెద్ అలీ ఖాన్ (ఎస్పీ) లల్న్ సింగ్ (జేడీయూ), హేమంత్ సోరెన్ (జేఎంఎం), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనలిస్ట్ కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు.

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ కూటమి కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి తీర్మానం చేసింది. ‘I.N.D.I.A. కూటమి పార్టీలమైన మేం, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్యం ప్రయత్నాలు తక్షణమే ప్రారంభమవుతాయి. సీట్ల పంపకాల్లో ఇచ్చిపుచ్చుకోవడంతో సహకార స్ఫూర్తితో వీలైనంత త్వరగా ముగిస్తాము’ అని తీర్మానం చేశాయి.

Related posts

ఇదేం న్యాయం… అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే అసోంలో రాహుల్ గాంధీ గుడికి వెళ్లకూడదా?: షర్మిల 

Ram Narayana

నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా?: జైరాం రమేశ్

Ram Narayana

దేశం గురించి నేను నిజం చెబితే… విభజించినట్లు అవుతుందా?: రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment