- మిస్సోరీ రాష్ట్రంలో భర్తతో కలిసి ఉంటున్న కవితకు కొంతకాలంగా అనారోగ్యం
- నగరంలోని ఎల్బీనగర్‌లో నివాసముంటున్న కవిత అత్తమామలు
- శారీరక ఇబ్బందులతో గురువారం ఇంట్లో కవిత ఉరివేసుకుని ఆత్మహత్య
అమెరికాలో ఉంటున్న ఓ హైదరాబాదీ మహిళ అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఏనుగు మల్లారెడ్డి, అనసూయ దంపతులు నగరంలోని ఏల్బీనగర్‌లో కామినేని ఆసుపత్రి వెనుక ఉన్న సూర్యోదయ కాలనీలో ఉంటున్నారు. ఆ దంపతుల కుమారుడు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో సిర్థపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఆయనకు 18 ఏళ్ల క్రితం కవిత(40)తో వివాహమైంది. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో అవస్థలు పడుతున్న కవిత గురువారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.