Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: వచ్చే నెలలో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం

  • డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • ఏర్పాట్ల సమీక్షకు రానున్న కేంద్ర ఎన్నికల బృందం
  • గుర్తింపు పొందిన పార్టీలు, అధికారులతో వరుస సమావేశాలు

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనుంది. అక్టోబర్ 3వ తేదీ నుండి మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లో ఈసీ బృందం సమీక్షిస్తుంది. 

మొదటి రోజు జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం కానుంది. ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. డబ్బు, మద్యం, కానుకల ప్రవాహ కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తుంది.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు, రాష్ట్ర పోలీస్ బలగాల నోడల్ అధికారులతో సమావేశమై భద్రతాపరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్నారు. చివరి రోజు రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.

Related posts

ఎన్నికల స్టంట్ అనుకోండి!: ఆర్టీసీ విలీనంపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులు.. స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు!

Ram Narayana

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …

Drukpadam

Leave a Comment