Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పార్టీ విలీనం ఉంటుందా? ..ఉండదా..? ఈనెల 30 లోపు తేల్చేస్తామన్న షర్మిల…!

పార్టీ విలీనం ఉంటుందా? ..ఉండదా..? ఈనెల 30 లోపు తేల్చేస్తామన్న షర్మిల…!
పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30లోపు నిర్ణయం తీసుకుంటానని షర్మిల స్పష్టీకరణ
అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ
పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందన్న షర్మిల
ఒకవేళ విలీనం కాకపోతే ఒంటరిగా ఎన్నికల బరిలోకి

వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఉంటుందా …? ఉండదా …?? అనే సందేహాల నడమ సోమవారం హైద్రాబాద్ లో జరిగిన ఆపార్టీ సమావేశంలో ఉండకపోతే ఒంటరిగా పోటీచేస్తాం ….ఉంటె అందరికి ప్రాధాన్యత ఉండేలా చేసే భాద్యత నాది అని అన్నారు . ఈనెల 30 లోపు ఎదో ఒక నిర్ణయం జరుగుతుందని అన్నారు .తనను ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీచేయమని అంటున్నారని ఏది అయినా అక్టోబర్ లో ప్రజాక్షేత్రంలో ఉంటానని అన్నారు . ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు…

తెలంగాణాలో రాజన్న రాజ్యంతెస్తానని ఆర్బాటంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి 3700 కి .మీ కు పైగా పాదయాత్ర చేసి నిరుద్యోగులకు అండగా అనేక ఆందోళనలు చేసి , కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఒంటికాలుతో లేచిన షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారనే వార్తలు చాలారోజులుగా చక్కర్లు కొడుతున్నాయి . అందుకు తగ్గట్లుగానే ఆమె కాంగ్రెస్ నేతలు చుట్టూ , ఢిల్లీ ,బెంగుళూరు తిరుగుతున్నారు .ఢిల్లీలో సోనియా రాహుల్ , ప్రియాంక గాంధీలను కలిసి తన పార్టీ విలీనం అభిప్రాయాలు వారితో పంచుకున్నారు . ఇటు బెంగుళూరులో డీకే శివకుమార్ ను రెండు ,మూడు పర్యాయాలు కల్సి చర్చలు జరిపారు . ఎందుకో ఆమె పార్టీ విలీనం ప్రక్రియ ఆలశ్యం కావడం ఆమెను నమ్ముకుని నడిచినవారు ఒక్కక్కరుగా బయటకు వెళ్లి పోతుండటంతో సోమవారం ఆమె హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు . తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు. అనేక మంది నేతలు ఆమె ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు . ఈసందర్భంగా తనను నమ్ముకున్నవాళ్లకు ఎట్టి పరిస్థితిలోను అన్యాయం జరగనివ్వమని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు .

పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్ణయం తీసుకుంటామని అప్పటివరకు ఆగాలని తెలిపారు . ఇతర పార్టీలో విలీనం చేయని పక్షంలో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామన్నారు . అక్టోబర్ రెండో వారం నుంచి షర్మిల ప్రజల మధ్యలో ఉండాలని కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. విలీనం అయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఆమె వివరణ పై అనేక సందేహాలు పార్టీ నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం …

Related posts

కాంగ్రెస్ ,కేసీఆర్ ఇద్దరు ఒక్కటే …తెలుగులో ప్రధాని మోడీ ..

Ram Narayana

గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది… రఘునందన్ రావు…

Ram Narayana

కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులు.. తెలంగాణ నేతలకు ఢిల్లీ నేత కీలక సూచన

Ram Narayana

Leave a Comment