Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మాయావతిపై జోక్ చేసిన ఫలితం.. ఐక్యరాజ్యసమితి పదవి ఊడింది!

మాయావతిపై జోక్ చేసిన ఫలితం.. ఐక్యరాజ్యసమితి పదవి ఊడింది!
-2012లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నబాలీవుడ్ నటుడు రణదీప్ హుడా
-మాయావతిపై కుళ్లు జోకు-సీఎంఎస్ ప్రచారకర్తగా తొలగింపు
-రణదీప్ హుడా క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్ల డిమాండ్
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా (44) ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి తరఫున కన్వెన్షన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ (సీఎంఎస్) సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, రణదీప్ హుడాను ఇప్పుడా పదవి నుంచి తప్పించారు.

అందుకు బలమైన కారణమే ఉంది. ఓ పాత వీడియోలో బహుజన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ మాయావతిపై కుళ్లు జోకు వేసిన ఫలితంగా రణదీప్ హుడాపై సీఎంఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యక్తులు తమకు అవసరం లేదని స్పష్టం చేసింది. హుడా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం అని స్పష్టం చేసింది.

సామాజిక స్పృహ ఉన్న సెలబ్రిటీగా గుర్తింపు పొందిన రణదీప్ హుడా 2020లో సీఎంఎస్ ప్రచారకర్తగా నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఈ నియామకం జరిగింది. 2012 నాటి వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయడం హుడాపై అందరి ఆగ్రహానికి కారణమైంది. మాయావతికి హుడా క్షమాపణలు చెప్పాలని అత్యధికులు డిమాండ్ చేస్తుండగా, ‘అరెస్ట్ రణదీప్ హుడా’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది.

Related posts

రైతు పండించిన ప్రతి గింజను కోంటాం జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు

Drukpadam

మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ విగ్రహం ఆవిష్కరణ..చిన జీయర్ స్వామి!

Drukpadam

పవన్ కల్యాణ్ పై విజయవాడలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు…

Drukpadam

Leave a Comment