Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అంతటికీ కారణం మోదీనే: సీపీఐ రామకృష్ణ…

  • ఫస్ట్ వేవ్ లో కరోనాను కట్టడి చేశామని గొప్పలు చెప్పుకున్నారు
  • అలాంటప్పుడు సెకండ్ వేవ్ కు కూడా మోదీనే బాధ్యత వహించాలి
  • మోదీని జగన్ ప్రశంసించడాన్ని జనాలు గమనిస్తున్నారు

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులకు ప్రధాని మోదీనే కారణమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కరోనా ఫస్ట్ వేవ్ ప్రధాని మోదీ వల్ల కంట్రోల్ అయిందని బీజేపీ చెప్పుకుంటోందని…  ఇప్పుడు సెకండ్ వేవ్ ఉద్ధృతంగా విస్తరిస్తున్న సమయంలో దానికి కూడా బీజేపీ బాధ్యత తీసుకోవాలని చెప్పారు.

విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వం గొప్పదనం అంటున్నారని… విఫలమయినప్పుడు రాష్ట్రాలపై నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభమేళా వల్లే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. యావత్ ప్రపంచంలోని కేసులను తీసుకుంటే మన దేశంలోనే 50 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలో బెంగాల్ లో ఎనిమిది విడతల పోలింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరగడానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీ మాట తప్పారని చెప్పారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. సీఎం జగన్ ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారని… జనాలకు అన్నీ అర్థం అవుతున్నాయని చెప్పారు.

Related posts

తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన జస్టిస్ చంద్రు…

Drukpadam

జానారెడ్డే మా సీఎం అభ్యర్థి … కాంగ్రెస్ నేతలు

Drukpadam

కేసీఆర్ కోరుకున్నట్లుగానే మిమ్మల్ని అధ్యక్షుడిగా చేశారనే విమర్శలపై కిషన్‌రెడ్డి సమాధానం !

Drukpadam

Leave a Comment