Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం పదవిపై తన మనసులో మాట వెల్లడించిన కేటీఆర్

  • నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • బీఆర్ఎస్ పార్టీలో సీఎం అయ్యే అర్హత చాలామందికి ఉందన్న కేటీఆర్
  • తనకు సీఎం అవ్వాలన్న కోరిక లేదని వెల్లడి
  • తెలంగాణ సీఎం ముమ్మాటికీ కేసీఆరేనని స్పష్టీకరణ
KTR talks about CM chair

తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, రాష్ట్ర పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, సీఎం పదవిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మాటికీ కేసీఆరేనని స్పష్టం చేశారు. “ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉంది. అందుకే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారు” అని కేటీఆర్ చమత్కరించారు. 

Related posts

కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్: తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన ఈటల !

Ram Narayana

రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖాస్త్రం…

Ram Narayana

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయి: కిషన్ రెడ్డి

Ram Narayana

Leave a Comment