Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

 సీపీఐతో కుదిరిన కాంగ్రెస్ పొత్తు… కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్, ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీలు

  • సీపీఐ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి
  • సీపీఐతో పొత్తు ఖరారైందని ప్రకటన
  • కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదిరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధిష్ఠానం సూచనలతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి స్వాగతం పలికారు. ఇరు పార్టీల నేతలు సీట్ల అంశంపై చర్చించారు. ఎన్నికలలో ఒక సీటు, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని వారికి రేవంత్ చెప్పారు. దీనికి సీపీఐ కూడా అంగీకరించింది.

అనంతరం రేవంత్ మాట్లాడుతూ… సీపీఐతో పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆ స్థానంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి వచ్చాక సీపీఐకి రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. సీపీఐకి శాసన సభతో పాటు మండలిలోనూ ప్రాతినిధ్యం ఉండాలన్నారు. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Related posts

ములుగు అసెంబ్లీ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కేసీఆర్ ….!

Ram Narayana

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తమిళిసై కీలక నిర్ణయం

Ram Narayana

ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థి రాయల నా … ?మండన నా …?

Ram Narayana

Leave a Comment