ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెసుదే హవా ..10 కి 10 మావే అంటున్న నేతలు
తమకు 4 సీట్లకు తక్కువ రావంటున్న బీఆర్ యస్ నేతలు
రెండు మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ యస్
గెలుపు ,ఓటములపై తర్జన భర్జన పడుతున్న అభ్యర్థులు
ఓటరు తీర్పు బ్యాలట్ బాక్స్ లలో నిక్షిప్తం …
డిసెంబర్ 3 న లెక్కింపు వెంటనే ఫలితాలు వెల్లడి …
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది… కాంగ్రెస్ హవా కంటే బీఆర్ యస్ ప్రభుత్వ వ్యతిరేకత అంటే సమంజసం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి …ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకోని పోవడంలో ప్రతిపక్ష పార్టీల సక్సెస్ అయ్యాయి… కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ప్రజల్లో బాగా నాటుకున్నాయి … ఆ నాలుగురిదే పాలన వారు చెప్పిందే వేదం …పార్టీలో అనేక మందికి పదవులు ఉన్న ,మంత్రులు అయినా, ముందు కేసీఆర్ కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవాల్సిందేననే భావన బలంగా ప్రజల్లో నాటుకుంది … ఇక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సామంత రాజులుగా తయారు అయ్యారు.. వారికీ మంచి, చెడులతో సంబంధం లేదు …తప్పు ,ఒప్పులు పట్టించు కోరు …. ఎమ్మెల్యేలు ఎవరిపై కేసు పెట్టమంటే వారిపై కేసు పోలీసులు పెట్టాల్సిందే …పెట్టక పొతే వారు ఆపోలీస్ స్టేషన్ నుంచి బదిలీ కావాల్సిందే …ఒకరకంగా చెప్పాలంటే ప్రజల మెప్పు పొందాల్సిన ఎమ్మెల్యేలు తమ వెంట తిరిగే ఒకరిద్దరు నేతల వల్ల చెడ్డ పేరు మూటకట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి ..ఎన్నికల్లో ఇదొక ప్రధాన అంశంగా కనిపించింది …
ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ స్థానిక నేతల పై ఉన్న వ్యతిరేకత బీఆర్ యస్ అభ్యర్థులకు ప్రతికూలంగా మారింది…దీంతో అభ్యర్థులు సొంత ఇమేజ్ ఉన్న దగ్గర తప్ప మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేయాలనే తపన ఓటర్లలో కనిపించింది… జిల్లాలో 10 సీట్లు గెలవ బోతున్నామని కాంగ్రెస్ శ్రేణులు జుబ్లియంట్ మూడ్ లో ఉన్నారు … మిత్ర పక్షం సిపిఐ తో కలుపుకుని 10 సీట్లు మావే అంటున్నారు … అదే సందర్భంలో తాము 2018 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని తమకు 4 సీట్లు తప్పకుండ వస్తాయని బీఆర్ యస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ..పరిశీలకు మాత్రం రెండు ,మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బీఆర్ యస్ కు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచిందని ,అయినప్పటికీ కాంగ్రెస్ కే హెడ్జ్ ఉందని అంటున్నారు … కేటీఆర్ అన్నట్లు నిజంగా కాంగ్రెస్ కు రాష్ట్రంలో అంత అనుకూలంగా ఉందా…? లేకపోతె అనేక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ఎలా చెపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి…