- రాజ్యసభలో లిఖితపూర్వక ప్రకటన చేసిన కేంద్ర సహాయమంత్రి కౌశల్ కుమార్
- 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడి
- కేంద్రం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టీకరణ
ఏపీ రాజధాని అమరావతి అంటూ కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక ప్రకటన చేశారు. 28 రాష్ట్రాల రాజధానుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని కౌశల్ కుమార్ తెలిపారు. ఈ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టం చేశారు. అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందని మంత్రి వెల్లడించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు కూడా కేంద్రం ఆమోదం ఉందని వివరించారు.